raviteja( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్రీమియర్ షో కలెక్షన్స్ అదరగొట్టాయిగా.. గ్రాస్ ఎంతంటే?

Mass Jathara: మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రీమియర్ షోలకు వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 5 కోట్ల రూపాయలు దాటాయి. ఇది భారతదేశంలో మాత్రమే కాకుండా, ఓవర్సీజ్ మార్కెట్‌లలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చినందుకు సాధ్యమైంది. ఏరియా-వైజ్ బ్రేక్‌డౌన్ ప్రకారం ఇండియా గ్రాస్ సుమారు 1.95 కోట్ల రూపాయలు (తెలుగు రాష్ట్రాల్లో 1.75 కోట్లు, కర్ణాటక & రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు). ఇండియా షేర్ 1.15 కోట్ల రూపాయలు రేంజ్‌లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల షేర్ 1 కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. సినిమా విడుదలైనప్పటినుంచీ రవితేజ ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు. మాస్ మహారాజ్ సినిమాకు ఏం కావాలో అన్నీ తగ్గట్టుగా ఈ సినిమాలో ఉన్నట్టగా ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇప్పటికే సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు మరింత ఆశలు పెట్టుకున్నారు.

Read also-Pan India trend: సినిమా ట్రెండ్ మారుతుందా?.. అందరూ పాన్ ఇండియా హీరోలేనా?.. రీజన్ ఇదే..

వరంగల్‌లో రైల్వే సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే లక్ష్మణ్ భేరి (రవితేజ) ఓ కారణంతో ఉత్తరాంధ్రలోని అడవివరం అనే గ్రామానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడ గంజాయి మాఫియా దందా విపరీతంగా సాగుతుంటుంది. శివుడు (నవీన్ చంద్ర) అనే క్రూర విలన్ కంట్రోల్‌లో ఉన్న ఈ గ్రామంలో రైల్వే స్టేషన్ పరిధిలోనే నేరాలు జరగకుండా చూసుకోవాల్సి వస్తుంది లక్ష్మణ్‌కు. అదే సమయంలో తులసి (శ్రీలీల) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఈ ప్రేమ, మాఫియా దందాల మధ్య లక్ష్మణ్ ఎలా పోరాడతాడు? రైల్వే పోలీసు అధికారి పరిధుల్లోనే మాఫియాను ఎలా అడ్డుకుంటాడు? అనేది కథా సారం. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక పవర్‌ఫుల్ పోలీసు గంజాయి మాఫియా మధ్య జరిగే పోరాటం. రైల్వే పోలీసు పరిధులు, పవర్స్‌పై కొంచెం ఫోకస్ చేయడం కొత్త అంశం.

Read also-Upcoming Telugu Movies: సినీ లవర్స్ కి గుడ్ న్యూస్.. వచ్చే వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ ఇదే!

సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఎలివేట్ చేస్తుంది. విధు అయ్యన్న అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అడవి, యాక్షన్ సీన్స్ కలర్‌ఫుల్ బాగా వచ్చాయి. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే అనిపించినా.. కానీ కొన్ని చోట్ల డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది. నందు రాసిన మాస్ ఎలివేషన్ డైలాగ్స్ సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి.

Just In

01

Vikarabad Crime: భార్య, కూతురు, వదినను గొంతుకోసి హత్య.. వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

Mass Jathara collection: రవితేజ ‘మాస్ జాతర’ డే 1 కలేక్షన్స్ ఎంతో తెలుసా.. ఆ రికార్డు బ్రేక్..

Auto Drivers: ఆటో డ్రైవర్లపై మొసలి కన్నీరు?.. గతంలో తప్పులు చేసి విమర్శలా అంటూ కాంగ్రెస్ మండిపాటు!

Private Travel Bus: రూల్స్ పాటించని ప్రైవేట్ బస్సులు.. సురక్షిత ప్రయాణానికి భరోసా ఏది?

DCP Kavitha: సైబర్ క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.. డీసీపీ దార కవిత సూచనలు