Midhun Reddy (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Midhun Reddy: వైసీపీ ఎంపీకి అరుదైన గౌరవం.. ఐరాసలో ప్రసంగించిన మిథున్ రెడ్డి

Midhun Reddy: వైసీపీ లోక్ సభ పక్షనేత మిథున్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ లా కమిషన్ 6వ కమిటీ పని నివేదికపై ఆయన మాట్లాడారు. పైరసీ, సముద్ర ఆయుధ దోపిడి నిరోధానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మిథున్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారత్ తరపున అభ్యంతరాలను సైతం మిథున్ రెడ్డి వ్యక్తం చేశారు.

‘అందుకు భారత్ కట్టుబడి ఉంది’

దేశాల మధ్య తలెత్తే వివాదాలకు పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తున్నట్లు మిథున్ రెడ్డి అన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశమన్న వైసీపీ ఎంపీ.. ఐక్యరాజ్యసమితి విధివిధానాలకు తమ దేశం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. వర్తకం, పెట్టుబడులలో తలెత్తే వివాదాల పరిష్కారాలకు ఐక్యరాజ్యసమితి విధానాలకు అనుగుణంగా భారత్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆర్బిట్రేషన్, ప్రత్యామ్నాయ పరిష్కార విధానాల ద్వారా సమస్యలను పరిష్కరిద్దామని భారత్ తరపున పిలుపునిచ్చారు.

‘చర్చల ద్వారానే పరిష్కారం’

అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల మధ్య వివాదాలను కూడా సంప్రదింపులు, చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ‘వ్యక్తిగత మానవ హక్కులు, న్యాయ సౌలభ్యం, అంతర్జాతీయ సంస్థల స్వతంత్ర పని విధానాల మధ్య సమతుల్యత అవసరం. అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కార సమయంలో దౌత్యపరమైన రక్షణలు అవసరం. పైరసీ, ఆయుధాల దోపిడి నిరోధానికి సమగ్రమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ అవసరం. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను సమగ్రంగా తయారు చేయాలి. కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వీటిని నిరోధించాలి’ అని మిథున్ రెడ్డి అన్నారు.

Also Read: Vizag Crime: మహిళా లెక్చరర్ల వేధింపులు.. విశాఖ విద్యార్థి సూసైడ్‌లో భారీ ట్విస్ట్.. వాట్సప్ చాట్ లీక్!

అంతర్జాతీయ ఆయుధ దోపిడిపై..

మరోవైపు అంతర్జాతీయంగా జరుగుతున్న ఆయుధాల దోపిడి నిరోధానికి సముద్ర చట్టాలను పరిగణలోకి తీసుకోవాలని ఐరాస సభలో మిథున్ రెడ్డి సూచించారు. ‘అంతర్జాతీయ చట్టాలను పరిగణలోకి తీసుకొని సముద్రంలో జరిగే ఆయుధాల దోపిడి నివారించాలి. స్టేట్స్ సక్సేషన్ విషయంలో పారదర్శక విధానాలు అవసరం. ఈ అంశంలో భీమల్ , పటేల్ నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును భారత్ స్వాగతిస్తోంది. జఠిలమైన ఈ అంశంలో స్పష్టమైన పాలనాపరమైన విధివిధానాలు అవసరం’ అని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Just In

01

KTR: కాంగ్రెస్ తోక క‌త్తిరించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

Talasani Srinivas Yadav: సంక్షేమ పధకాలు ఆగితే పోరాటం చేస్తాం.. మాజీ మంత్రులు తలసాని కీలక వ్యాఖ్యలు

Srinivas Goud: ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

Hydra: మ‌ణికొండ మున్సిపాలిటీలో హైడ్రా యాక్షన్.. 300ల కోట్ల విలువైన భూమి సేవ్

Ramchander Rao: కాంగ్రెస్ పాలన వైఫల్యాలు మోసాలపై బీజేపీ చార్జ్ షీట్ రిలీజ్ : రాంచందర్​ రావు