JubileeHills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో (JubileeHills Bypoll) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రావడంతో కేటీఆర్ ఆటోల్లో తిరుగుతున్నారని, కానీ, మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడన్నా ఈ ప్రాంతాల్లో తిరిగారా? అని ప్రశ్నించారు. గాలి మోటార్లు, బెంజ్ కార్లలో తిరిగిన ఈ వ్యక్తి ఇవాళ రబ్బర్ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతున్నాడని మండిపడ్డారు.
‘‘ఆటలలో తిరుక్కుంటూ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెబుతుండు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటడా?. అందుకే వాళ్లను బిల్లా రంగా అని దొంగలతో పోల్చిన. మీరేమంటారు సోదరులారా?. బిల్లా రంగాలే కదా!. ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే ఒక కరెంట్ పోల్ చూసి కట్టెయిర్రి. భాషా సినిమాలో కట్టేస్తరు కదా. గట్టా కట్టేసి కరెంట్ షాక్ పెట్టుర్రి. పదేళ్లు చేసిందేందో చెప్పమని అడుగుర్రి. రెండుసార్లు ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేశారని లెక్క అడగండి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో, సభకు హాజరైనవారితో పాటు ఆయనతో వేదిక పంచుకున్నవారి ముఖాల్లో నవ్వులు కనిపించాయి.
కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో శ్రీ గణేష్ గెలిపిస్తే రూ.4 వేల కోట్లు మంజూరు చేసి, 30 ఏళ్ల నుంచి తీరని సమస్యలను ఆర్మీతో మాట్లాడి, భూమి తీసుకొని, ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఆర్మీ ల్యాండ్‌లో ఇళ్లు కట్టుకున్న పేదవాళ్లకు పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఎప్పుడైనా జూబ్లీహిల్స్‌లో సమస్యలు ఉన్నాయంటూ అప్లికేషన్లు ఇచ్చారా?, ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి బయటకొచ్చారని విమర్శించారు. ఇంటి ఆడబిడ్డ ఇల్లిల్లూ తిరుగుతుంటే, సొంత ఆడబిడ్డనే వదిలిపెట్టారని కేటీఆర్, కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలకు న్యాయం చేయాలని, అందుకే సీతక్కకు, సురేఖకు అందుకే మంత్రి పదవులు ఇచ్చామని అన్నారు.
Read Also – KTR: జూబ్లీహిల్స్‌లో కారుకు బుల్డోజర్‌కు మధ్యపోటీ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
