Allu Sirish engagement: తెలుగు సినీ కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యువ హీరోగా పేరొందిన అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. అల్లు కుటుంబం ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. శిరీష్ – నయనిక ప్రేమకథ ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇటీవలే శిరీష్ తన సోషల్ మీడియా ద్వారా ‘ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నా’ అని వెల్లడించాడు. అయితే నయనిక వివరాలపై కొంత గోప్యత కొనసాగిస్తూ, ఆమె ఫోటోలు, పేరే మాత్రమే బయటపడ్డాయి. దీపావళి వేడుకల్లో అల్లు కుటుంబ ఫోటోలు లీక్ కాగానే నయనిక కూడా వారిలో ఉన్నట్లు స్పష్టమైంది. నిశ్చితార్థ వేడుకకు అల్లు కుటుంబ సభ్యులు, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్, చిరంజీవి , రామ్ చరణ్ వంటి అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో శిరీష్, నయనిక మెరిసిపోయారు.
Read also-Sandigdham teaser: ‘సందిగ్ధం’ టీజర్ వచ్చేసింది గురూ.. ఓ లుక్కేసుకో మరి..
దీంతో అల్లు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నిశ్చితార్థం ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అభిమానులకు ఇది మరొక ఉత్సవంలా ఉంది. అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం తెలుగు సినీ కుటుంబాల్లో ఆనందంగా, భార్యాభర్తగా కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన ఆత్మీయ వేడుకగా నిలిచింది. సినిమా అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీలు శిరీష్ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
#AlluSirish and #Nayanika got engaged in an intimate ceremony surrounded by close family.
Wishing the beautiful couple a lifetime of love and happiness. pic.twitter.com/HcUHlwhOBR
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 31, 2025
