peater (image :x)
ఎంటర్‌టైన్మెంట్

Peter movie teaser: ‘పీటర్’ మూవీ టీజర్ మరీ ఇంత థ్రిల్లింగ్ గా ఉందేంటి..

Peter movie teaser: సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అదే కోవ నుంచి వస్తున్న మరో సినిమా ‘పీటర్’. తాజాగా అదే సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు నిర్మాతలు. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

Read also-Sandigdham teaser: ‘సందిగ్ధం’ టీజర్ వచ్చేసింది గురూ.. ఓ లుక్కేసుకో మరి..

‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను’ అంటూ సాగిన టీజర్ ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. ‘పీటర్’ టీజర్‌ను గమనిస్తే కేరళ సంప్రదాయం, కేరళ అందాల్ని అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది. టీజర్ కట్ చేసిన విధానం చూస్తుంటే.. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో మరో అద్భుతమైన చిత్రం రానున్నట్టుగా అనిపిస్తోంది. ఈ టీజర్‌లో చూపించిన విజువల్స్, భయపెట్టేలా చూపించిన కెమెరా యాంగిల్స్, వెంటాడే నేపథ్య సంగీతం అన్నీ కూడా హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. పీటర్ కథ ఏంటి? జెస్సీ ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలకు త్వరలోనే సమాధానం రానుంది.

Read also-Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి మెలొడీ సాంగ్ వచ్చేసింది.. ఇక్కడ చూసేయండి..

రాజేష్ ధ్రువ సినిమాలో ఇంటెన్స్ పర్ఫామెన్స్‌తో, అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించబోతోన్నాడని అర్థం అవుతోంది. సినిమాటోగ్రాఫర్ గురుప్రసాద్ నార్నాడ్ విజువల్స్ ఎంతో సహజంగా కనిపిస్తుండగా.. రిత్విక్ మురళీధర్ సంగీతం భయాన్ని, భావోద్వేగాన్ని పెంచేలా ఉంది. ఎడిటర్ నవీన్ శెట్టి కట్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ‘పీటర్’ త్వరలోనే రిలీజ్‌ కానుంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఇతర అప్డేట్‌లను మేకర్లను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాలో రాజేష్ ధృవ, జాన్వీ రాయల, రవిక్షా శెట్టి, రామ్ నాదగౌడ్, వరుణ్ పటేల్, ప్రతిమా నాయక్, రఘు పాండేశ్వర్, రాధాకృష్ణ కుంబ్లే, దీనా పూజారి, సిద్దు, భరత్, మను కాసర్‌గోడ్, రక్షిత్ దొడ్డెర తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

Just In

01

Shambala trailer: ఆది సాయి కుమార్ ‘శంబాల’ ట్రైలర్ వచ్చేసింది చూశారా..

Midhun Reddy: వైసీపీ ఎంపీకి అరుదైన గౌరవం.. ఐరాసలో ప్రసంగించిన మిథున్ రెడ్డి

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తాజా సర్వే.. రెండు పార్టీల మధ్య ఎంత శాతం తేడానో తెలుసా?

Dangerous Temples: ప్రాణాలను పణంగా పెట్టి పూజించే దేవాలయాలు.. ఎక్కడంటే?

Vizag Crime: మహిళా లెక్చరర్ల వేధింపులు.. విశాఖ విద్యార్థి సూసైడ్‌లో భారీ ట్విస్ట్.. వాట్సప్ చాట్ లీక్!