Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్’ నుంచి మెలొడీ సాంగ్ వచ్చేసింది
andhar king( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి మెలొడీ సాంగ్ వచ్చేసింది.. ఇక్కడ చూసేయండి..

Andhra King Taluka: రామ్ పోతినేని హరోగా తెరకెక్కుతున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా నుంచి మెలొడీ సాంగ్ విడుదలైంది. మహేష్ బాబు పి. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 28, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం, ఆంధ్రప్రదేశ్‌లోని ఫ్యాన్ కల్చర్‌ను లోతుగా చిత్రీకరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో కథానాయికగా కనిపిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో హీరో రోల్ లో కనిపించనున్నారు. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు కీ రోల్ ప్లే చేయనున్నారు. ‘మిస్ షెట్టి మిస్టర్ పొలిషెట్టి’తో డెబ్యూ చేసిన దర్శకుడు మహేష్ బాబు పి. ఈ సినిమాలో తన మార్క్ చేస్తున్నారు. మ్యూజిక్ వివేక్-మెర్విన్ డ్యూయో అందిస్తున్నారు. ఇది ఆయన తొలి తెలుగు ప్రాజెక్ట్. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ పొందాయి.

Read also-Mega concert 2025: ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. పెద్ది సాంగ్ వచ్చేది అప్పుడేనా?..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎప్పటిలాగే తన ఎనర్జీని ఈ సినిమాలో కూడా చూపించారు. ప్రతి సీన్ లోనూ 90ల నాట్ ఫ్యాన్స్ ఎలా ఉండేవారో అచ్చం అలాగే తన ఎమోషన్స్ ను పండించాడు రామ్ పోతినేని. హీరోయిన భాగ్యశ్రీ పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయింది. తన క్యూట్ హావభావాలతో మరో సారి ప్రేక్షకులను మెప్పించింది. వీరిద్దరి మధ్య కాలేజీ లవ్ స్టోరీ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రతి డైలాగ్ ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా ఉంది. టీజర్ తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Prasanth Varma: ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్..

రామ్ పోతినేని హీరో గా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా సినియా నుంచి విడుదలైన చిన్ని గుండెలో వేల తారలా.. సాంగ్ లిరికల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గాలి, ఈ నేల, ఈ హోరు.. మన ఇద్దరం అంటూ మొదలవుతుంది సాంగ్. ఇద్దరు ప్రేమికులు సినిమా తారల్లా మారి వారి మధ్యకు ఓ సాంగ్ వస్తే ఎలా ఉంటుందో ఈ పాటను అలాగే చిత్రీకరించారు మూవీ టీం. వివేక్, మార్విన్ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకనేలా ఉంది. మార్విన్, సత్య యామిని అందించి గాత్రం ఈ పాటను మరింత ప్రాణం పోశాయి. కృష్ణ కాంత్ అందిచిన లిరిక్స్ తెలుగు పాటను మళ్లీ జీవం పోసేలా చాలా సరళంగా అనిపించాయి. ఈ సాంగ్ మొత్తం వేరే లెవిల్ సెట్ లో చిత్రీకరించారు. దీంతో ఈ పాటకు మరింత అందం వచ్చింది. ఇప్పటికే వచ్చిన పాటలతో పాటు ఈ పాట కూడా సంగీత ప్రేమికుల ప్లే లిస్ట్ లోకి చేరిపోయేలా ఉంది.

Just In

01

Farmer Sells Kidney: రోజుకు రూ.10 వేల వడ్డీతో రూ.1 లక్ష అప్పు.. భారం రూ.74 లక్షలకు పెరగడంతో కిడ్నీ అమ్ముకున్న రైతు

Polling Staff Protest: మధ్యాహ్న భోజనం దొరకక ఎన్నికల పోలింగ్ సిబ్బంది నిరసన

Delhi Government: ఆ సర్టిఫికేట్ లేకుంటే.. పెట్రోల్, డీజిల్ బంద్.. ప్రభుత్వం సంచలన ప్రకటన

Champion: ‘ఛాంపియన్’ కోసం ‘చిరుత’.. శ్రీకాంత్ తనయుడికి కలిసొచ్చేనా?

Boyapati Sreenu: నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి