HC send notice to ktr
Politics

Coal Mining: సింగరేణిని కాపాడిందే మేము!

– సింగరేణి మెడపై కేంద్రం కత్తి
– ఆ కత్తికి సాన పెడుతున్న కాంగ్రెస్
– బీజేపీతో కలిసి కుట్రలు
– బొగ్గు గనుల వేలంపాటను ఉపసంహరించుకోవాలి
– వేలంపై మేం మొదట్నుంచి పోరాడుతున్నాం
– మేం గెలిచి ఉంటే వేలాన్ని అడ్డుకునేవాళ్లం
– రాష్ట్ర ప్రభుత్వం వేలంలో పాల్గొంటామనడం దారుణం
– కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఆగ్రహం

KTR: బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే నిర్ణయాత్మక పాత్ర పోషించేవాళ్లమని, బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకునేవాళ్లమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇన్నాళ్లూ సింగరేణి సంస్థను కేసీఆర్ కాపాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టే పని చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటని లోక్ సభ ఎన్నికల వేళ ప్రశ్నలు వేశారని, కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఉంటే సింగరేణి సంస్థకు గనులు దక్కేలా చేసేవారమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎప్పటికైనా తెలంగాణకు బీఆర్ఎస్సే రక్షణ కవచం అని వివరించారు. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని కేసీఆర్ పలుమార్లు పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో 16 ఎంపీలు గెలుచుకున్న టీడీపీ అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోబోతున్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ మెడ మీద కత్తి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కత్తిని సాన బెడుతున్నదని కేటీఆర్ అన్నారు. సింగరేణి బొగ్గు గనులు అమ్మేందుకు వేలం పాట నిర్వహిస్తే, అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొనబోతున్నామని చెప్పడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్లో తమపై విశ్వాసం ఉన్నదని, నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు వీటన్నింటినీ రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం తమ మెడ మీద కత్తి పెట్టినా బొగ్గు గనులను వేలం వేయకుండా చూశామని గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేండ్లు సింగరేణిని కాపాడుకుంటూ వచ్చామని చెప్పారు కేటీఆర్. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా ఏ టెండర్, వేలం లేకుండా, ఒడిశాలో రెండు గనులను నైవేల్లి లిగ్నైట్ లిమిటెడ్ కు అప్పగించిందని వివరించారు. అలాగే, గుజరాత్ లో 4 బొగ్గు గనులు అప్పజెప్పారన్నారు. సింగరేణి విషయంలో కూడా ఇలాగే చేస్తారని, ఇది ఉద్దేశపూర్వక కుట్ర అంటూ మండిపడ్డారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?