Bhatti Vikramarka( image credit: swetcha reporter)
తెలంగాణ

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ.303 కోట్లు వెంటనే విడుదల చేయాలి: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: పెండింగ్ లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీ స్కాలర్షిప్ బకాయిలు రూ. 303 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.2022 నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని  ఆదేశించారు.దీంతో నిరాశ, నిస్పృహల్లో ఉన్న వేల కుటుంబాల్లో డిప్యూటీ సీఎం ఆదేశాలు ఆనందం నింపింది. ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ విదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగాలని ఆలోచనతో వేలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్ పై విదేశాలకు వెళ్లారు.గత ప్రభుత్వ కాలం నుంచి ఓవర్సీస్ స్కాలర్షిప్ అందకపోవడంతో విదేశాల్లో ఉన్న విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందక మరోవైపు అమెరికా, యూకే వంటి దేశంలో కొత్త కొత్త ఆంక్షలతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీవ్రమైంది.

Also ReadBhatti Vikramarka: మహిళలకు కీలక సందేశం ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఒకేసారి క్లియర్ చేయాలి

ఆయా దేశాల్లో గతంలో మాదిరిగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు. అక్కడ రోజురోజుకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ భారం పెరుగుతుంది. ఈ పరిస్థితిలన్నిటిని అవగాహన చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ సమస్యను ప్రాధాన్యత అంశంగా భావించి ఓవర్సీస్ స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం ఆదేశాలతో వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. కష్టకాలంలో ప్రభుత్వం ప్రతి విద్యార్థి సుమారు 20 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో తమ బిడ్డలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని, తమ ఇబ్బందులు తొలగిపోతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి రాష్ట్రానికి, దేశానికి తిరిగి అర్థవంతమైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఆశాభావంతో ఉన్నట్టు ఓవర్సీస్ విద్యార్థులు తెలిపారు.

Also Read: Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

Just In

01

Medak Bribe Case: రైతు నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ట్రాన్స్‌కో డీఈ..

Rayaparthi MPDO: ఎంపీడీవోపై టైపిస్ట్ ఆరోపణలు.. గ్రామపంచాయతీ కార్యదర్శుల ప్రెస్‌మీట్.. ఏంటీ వ్యవహారం?

Woman Farmer: చేతులు పట్టుకొని భోరున ఏడ్చిన మహిళా రైతు.. చలించిపోయిన మంత్రి పొన్నం!

Mahakali: ‘మహాకాళి’గా ఎవరంటే.. ఫస్ట్ లుక్ అరాచకం!

Revanth Serious: జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ సీరియస్!.. కారణం ఏంటో తెలుసా?