Nonstop Fun: బిగ్ బాస్ హౌస్‌లో నాన్ స్టాప్ ఫన్.. పొట్టచెక్కలే!
Bigg Boss Nonstop Fun Episode (Image Source: YT)
ఎంటర్‌టైన్‌మెంట్

Nonstop Fun: బిగ్ బాస్ హౌస్‌లో నాన్ స్టాప్ ఫన్.. ఇమ్ము, సుమన్ ఇమిటేషన్‌కు మెంబర్స్ షాక్!

Nonstop Fun: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 52వ (Bigg Boss Telugu Season 9 Day 52) రోజుకు సంబంధించి ఇప్పటి వరకు రెండు ప్రోమోలను టీమ్ విడుదల చేసింది. ఈ రెండు ప్రోమోలలో సీరియస్‌నెస్‌తో హౌస్‌లో, ఆడియెన్స్‌లో ఫైర్ పుట్టించిన బిగ్ బాస్.. తాజాగా మరో ప్రోమోని వదిలి, అందరూ హాయిగా నవ్వుకునేలా చేశారు. అందుకే ఈ ప్రోమోకు నాన్‌స్టాప్ ఫన్ (Nonstop Fun) అని నామకరణం చేశారు. భరణి, శ్రీజ రీఎంట్రీకి సంబంధించి జరిగిన ఫిజికల్ టాస్క్‌లో భరణి (Bharani) గాయపడి బయటకు వచ్చేసినట్లుగా ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోస్ తెలియజేశాయి. ఇప్పుడొచ్చిన ప్రోమోలో మాత్రం హౌస్‌లోని సభ్యులందరూ ఒక చోట చేరి హాయిగా నవ్వుకుంటున్నారు. అందులోనూ బయట వర్షం పడుతుండటంతో.. ఇంటిలోనే అందరినీ ఒక చోటకు చేర్చి బిగ్ బాస్ ఈ రకమైన ఎంటర్‌టైన్ ప్లాన్ చేసి ఉండొచ్చు. టాస్క్‌లతో విసిగిపోయిన హౌస్‌మేట్స్‌కు కూడా ఈ నాన్‌స్టాప్ ఫన్ కొంత ఉపశమనం ఇస్తుందని చెప్పుకోవచ్చు.

Also Read- Raju Weds Rambai: ‘ఆర్ఎక్స్ 100’, ‘బేబి’.. ఆ జాబితాలోకి చేరే సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’

ఉల్లి దొంగ ఎవరు?

బిగ్ బాస్ తెలుగు 9 డే 53కి సంబంధించి వచ్చిన ప్రోమో 3లో ఉన్న మ్యాటర్ ఏమిటంటే.. హౌస్‌లోని మెంబర్స్ కొందరూ భోజనం చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ వచ్చి దివ్య ప్లేట్‌లో ఆనియన్ పీస్ పెడుతుండగా.. నాకొద్దు అంటూ అతడిని పంపించేసింది. అది ఇమ్ముకి చూపించగా.. నాకొద్దురా.. ఈ రోజు నేను ఉపవాసం అంటూ సరదాగా కళ్యాణ్‌ని ఆటపట్టించాడు. ఇంతలో తనూజ వచ్చి.. ‘ఒరేయ్.. వాళ్లు ఉల్లిపాయలన్నింటినీ దొంగతనం చేసి తింటున్నారు’ అంటూ కంప్లయింట్ ఇస్తుంది. ‘ఇమ్మూ అన్నా.. మీరు తినండి అంటే, నాకు వద్దూ అన్నాడు’ అని కళ్యాణ్ కూడా వాదిస్తున్నాడు. దీనిపై ఇమ్ము (Emmanuel) వివరణ ఇస్తున్నాడు. ఈ విషయంపై గొడవ చేయకుండా అందరూ ఆగండి.. ఆగకపోతే బాటిల్‌తో నెత్తి పగలకొట్టుకుంటా అంటూ సరదాగా ఇమ్ము అందరినీ బెదిరిస్తున్నాడు. ‘బిగ్ బాస్.. 3 డేస్ నుంచి కిచెన్‌లో దొంగతనం జరుగుతుంది. దొంగలున్నారు జాగ్రత్త బోర్డు పంపించండి’ అని ఇమ్ము బిగ్‌ బాస్‌కి కంప్లయింట్ చేస్తున్నాడు. అందరూ వచ్చి ఇమ్మునే ఉల్లి దొంగ అంటూ నిందిస్తున్నారు. అంతా హాయిగా నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత అసలు సిసలు నాన్‌స్టాప్ ఫన్ మొదలైంది.

Also Read- Bigg Boss Telugu 9: రీ ఎంట్రీలో షాకింగ్ ట్విస్ట్.. భరణికి ఏమైంది?

తనూజ అస్సలు ఏడ్వదు

జబర్ధస్త్‌లో ఇన్నర్ వాయిస్ ఏం మాట్లాడుకుంటుంది? అనే ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా సుమన్‌ను ముందు నిలబెట్టి.. వెనుక నుంచి ఇమ్ము వాయిస్ ఇస్తున్నాడు. ముందుగా గౌరవ్ చాలా తెలివైన వాడు అని సుమన్ శెట్టి (Suman Shetty) అంటుంటే.. ఇమ్ము వచ్చి ‘గౌరవ్.. తెలివి.. అరె వాకీటాకీని కింద పడేసి నొక్కకుండా.. హలో హలో అనే వీడిదొక తెలివి. కండలు పెంచావురా.. కొద్దిగా బుర్ర పెంచరా’ అని ఇమ్ము చెప్పగానే.. అంతా నవ్వుతున్నారు. సంజన అందరితో కలిసిపోదామని చూస్తుందని.. సుమన్ శెట్టి అనగానే.. ‘యాడరా కలిసిపోయేది.. యాడ కలిసిపోయేది. ఎవర్రా చెప్పింది కలిసిపోతుందని. ఎవడన్నా ఏడుస్తుంటే.. క్లాప్స్ కొట్టి.. ఎందుకు మేడమ్ అంటుంది’ అని ఇమ్ము ఇచ్చిన వాయిస్‌కు అంతా పగలబడి నవ్వేశారు. ‘తనూజ ఎవరితోనూ గొడవ పడదు. అలగదు.. అస్సలు ఏడ్వదు. ఎప్పుడు చూసినా.. కళకళకళా నవ్వుతూనే ఉంటుంది. రేషన్ మేనేజర్‌గా చాలా చక్కగా చేస్తుంది’ అని సుమన్ శెట్టి అనగానే.. ఇమ్ము మాట్లాడలేక.. పొట్టచెక్కలయ్యేలా పడి పడి నవ్వుతున్నాడు. దాదాపు మిగతా ఇంటి సభ్యులది కూడా సేమ్ పరిస్థితి. ఇలా ఈ ప్రోమో ముగిసింది.


స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!