Government Lands (imagecredit:twitter)
తెలంగాణ

Government Lands: త్వరలో ప్రభుత్వానికి అందనున్న నిషేధిత భూముల జాబితా..!

Government Lands: నిషేధిత భూములను గుర్తించి జాబితాను సిద్దం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బంది రంగంలో దిగారు. వీళ్లు ప్రతి గ్రామంలోని సర్వే నెంబర్లను ఆధారంగా చేసుకోని ప్రభుత్వానికి సంబంధించిన భూములుగానీ, ఇతరత్ర వివాదాలకు సంబంధించిన భూ వివరాలను సేకరించి నివేధిక రూపోందిచనున్నారు. కోత్తగా రూపోందించే నిషేదిత జాబితాతో లావాదేవీలకు అవకాశం ఉందా లేదా అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా నిషేధిత జాబితాలోని భూ వివరాలను సేకరించి నిశ్చితమైన నివేధిక ప్రభుత్వానికి సమర్పించనున్నారు. రెవెన్యూ యాక్ట్​కు లోబడి నిషేధిత భూములను గుర్తిస్తున్నట్లు సమాచారం.

మరో రెండు రోజుల్లో పూర్తి నివేధిక.. 

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మండలంలోని తహాశీల్ధార్లు ఏఏ గ్రామాల్లో నిషేధిత భూములున్నాయో గుర్తించి నివేధిక ఇవ్వనున్నారు. ఇప్పటికే మండలాల్లోని తహశీల్ధార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి జాబితాలను సిద్దం చేస్తున్నారు. ఈ జాబితాలను ఇప్పటికే 80శాతం వరకు అన్ని మండలాల తహశీల్ధార్లు నివేధికలు కలెక్టర్లకు సమర్పించినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో జాబితాలు సిద్దం. ఈ జాబితాలను కలెక్టర్లు ప్రభుత్వానికి అందజేయనున్నారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని 27, మేడ్చల్​లో 15, వికారబాద్​లో 18 మండలల్లోని అన్ని గ్రామాల భూ వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో ని ఏ గ్రామంలోని ఎన్ని ఎకరాలు 22 ఏ జాబితాలో ఉన్నాయో స్పష్టమైన డాటా అందుబాటులో ఉంటాయి.

ఇవన్నీ నిషేధిత భూములే.. 

రాష్ట్ర ప్రభుత్వం రూపోందించిన రెవెన్యూ (Revenu)చట్టం ప్రకారం నిషేధిత జాబితాలో ఉండనున్న భూములు ఇవే. ప్రభుత్వ స్థలాలు(Government lands), అసైన్డ్​ భూములు(assigned lands), సీలింగ్(Celing)​, భూధాన్(Bhoodan)​, వక్ఫ్ బోర్డ్(Waqf Board)​, ఎండోనెమెంట్ భూములతో పాటు ఈడీ, సీఐడీ, ఏసీబీ నేరలతో పట్టుబడిన వ్యక్తులకు సంబంధించిన అటాచ్​ భూములు నిషేధిత జాబితాలో పెట్టనున్నారు. ఈ భూముల ప్రస్తుత పరిస్థితి ఏలా ఉందో స్పష్టంగా నివేధికను అధికారులు ఇవ్వనున్నారు. ఇన్ని రోజులుగా 2007లో రూపోందించిన జాబితాలోని భూములనే 22ఏగా పరిగణిస్తూ అధికారులు అధికారికంగా పనిచేశారు. కానీ గత ప్రభుత్వంలో 22ఏ జాబితాను బేఖాతర్​ చేస్తూ అనేక భూములను క్రయవిక్రయాలు చేసిన ఘనత అధికారులకే దక్కిందని చెప్పాల్సిందే.

Also Read: DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

ఇప్పటికైన మోక్షం కలిగేనా.? 

అధికారపార్టీలోని రియల్​ వ్యాపారులతో ప్రభుత్వ అధీనంలోని భూములు అన్యాక్రంతమైతున్న సంఘటనలు అనేకమున్నాయి. ప్రభుత్వ భూములను సైతం పట్టాలుగా మార్పు చేసిన ఘనత రెవెన్యూ అధికారులదే. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత భూముల జాబితాను మరోసారి కోరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రెవెన్యూ చట్టాలకు విరుద్దంగా భూ క్రయవిక్రయాలు జరగడంతో ప్రభుత్వాలు అబాసుపాలైయింది. మరోసారి ప్రజల దృష్టిలో దోషిగా ఉండకుడదనే ఉద్దేశ్యంతో భూములను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటుంది. దీంతో ప్రభుత్వ భూములకు రక్​షణ కానున్నట్లు తెలుస్తోంది.

వెబ్​సైట్​లో పోందుపర్చే అవకాశం.. 

రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత భూముల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. జిల్లాల నుంచి వివరాలను అధికారిక వెబ్​సైట్లో పోందుపుస్తారా లేక వదిలేస్తారా చూడాలి. తీసుకున్న నిషేధిత జాబితా వివరాలను స్టాంప్స్​ ఆండ్​ రిజిస్ట్రేషన్​ శాఖ(Stamps and Registration Department) అధికారిక వెబ్​సైట్​లో పోందుపర్చే అవకాశాలున్నాయి. పోందుపర్చునట్లేయింతే ప్రభుత్వ భూముల వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. రంగారెడ్(Rangareddy)డిలో 606, మేడ్చల్(Medchel)​లో 162, వికారబాద్(Vikarabad)​లో 493 గ్రామాల్లో నిషేధిత భూములున్నట్లు తెలుస్తోంది.

Also Read: Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ