Maoists Killed (imagecredit:twitter)
తెలంగాణ

Maoists Killed: చత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు

Maoists Killed: బీజాపూర్ జిల్లా నారాయణపురం మరియు ఆబూజుమాడ్ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ వివరాలు అధికారులు మరియు పోలీసులు అందిస్తున్న ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం ఆబూజుమాడ్ అడవీ ప్రాంతంలో జరిగింది, ఇది నారాయణపురం సమీపంలో ఉంది. చత్తీస్ఘడ్ లోని నారాయణపూర్.. బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతం అబూజ్ మాడ్ లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం . అబూజ్ మాడ్(Abuge Mad) అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 2025న ఇద్దరు మావోయిస్టులు రాజు దాదా(Raju dada), కోస దాదా మావోయిస్టులు పోలీసులతో జరిగిన గన్ ఫైట్ లో మృతి చెందారు. వీరిద్దరూ పేరిట రూ. 40 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఈ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన ఆస్తులు, ఆయుధాలు పోలీసులకు భారీగా లభ్యమయ్యాయి.

నారాయణపూర్ సరిహద్దుల్లో..

ఆ ఇద్దరు ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. అప్పటినుంచి ఈ ప్రాంతంలో డిఆర్జి(DRG), బిఎస్ఎఫ్(BFC) ప్రత్యేక బలగాలతో కలిసి కూంబింగ్ చర్యలు కొనసాగుతున్నాయి. 2025 లో ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిస్టుల్లో మానసికంగా, కార్యకలాపాలను నిర్వహించడంలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అబూజ్ మాడ్ ప్రాంతం, బీజాపూర్, నారాయణపూర్ సరిహద్దుల్లో సైనిక దళాలు మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘాతో వ్యవహరిస్తూ మావోయిస్టుల చర్యలను నిరోధిస్తున్నారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఫోర్స్, డి ఆర్ జి, బిఎస్ఎఫ్, ఎస్ టి ఎఫ్, పి ఆర్ పి ఎఫ్, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అతి భయంకరమైన కోబ్రా భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో 24 ఇంటు సెవెన్ నిఘాతో మావోయిస్టుల చర్యలపై అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నాయి. అబూజ్ మాడ్ మావోయిస్టు గుహలు, అటవీ ప్రాంతాల్లో వారి స్థావరాలపై అప్రకటిత యుద్ధం ప్రకటించి ముందుకు సాగుతున్నాయి.

Also Read: Disability Empowerment: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..!

మావోయిస్టులు చెల్లాచెదురు

2025 లో చత్తీస్ ఘడ్(Chhattisgarh) రాష్ట్రంలో 248 మందికి పైగా మావోయిస్టులు పోలీసులకు.. మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. మావోయిస్టులు ఉపయోగించే ఐఈడి(IED) బాంబులను భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు పూర్తి భద్రత లేకుండా బిక్కు బిక్కు మంటూ అడవుల్లో సంచరిస్తున్నారు. అటవీ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లకుండా భద్రతా బలగాలు సురేక్షితమైన చర్యలు చేపడుతోంది. ఈ రెండు జిల్లాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో కొద్దిరోజుల వ్యవధిలోనే ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటుంది. దీంతో మావోయిస్టులు చెల్లాచెదురుగా కావాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన చర్యలతో వివిధ రకాల భద్రతా బలగాలు మావోయిస్టు ప్రాంతాల్లో భీకర ఎదురుకాల్పులతోపాటు పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోయేందుకు పటిష్ట ప్రణాళిక రచించారు. అయితే బుధవారం జరిగిన ఎన్కౌంటర్ ల 10 మంది మృతి చెందినట్లుగా అధికారుల సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే అటు మావోయిస్టులు మృతి చెందారా..? లేదంటే భద్రతా బలగాల్లో నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Mahabubabad: ఆ జిల్లాలో ఒక్క మద్యం షాపు విలువ ఎన్ని లక్షలో తెలుసా?

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ