Kishan Reddy (imagecrdit:twitter)
తెలంగాణ

Kishan Reddy: రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణకు సరిపడా యూరియా సరఫరా

Kishan Reddy: ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అమలు చేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ(Modhi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా సాగుతుందన్నారు. రైతులపై ఎరువుల ధరల భారం పడకుండా, ఎరువుల ఉత్పత్తి కంపెనీలపై ఆర్థికభారాన్ని తగ్గించేందుకు రూ.37,952 కోట్ల న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. 2025-26 రబీ సీజన్‌కు డై అల్యూమినియం ఫాస్పేట్, మోనో అల్యూమినియం ఫాస్పేట్, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్, ట్రిపుల్ సూపర్ ఫాస్పేట్, 3 గ్రేడ్స్ ఆఫ్ సింగిల్ సూపర్ ఫాస్పేట్, పొటాష్ డెరైవ్‌డ్ మొలాసెస్, అల్యూమినియం సల్ఫేట్ వంటి దాదాపు 28 ఎన్పీకేఎస్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీలకు న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ అమలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు.

దశలవారీగా నిధులు విడుదల

ఈ ఏడాది మార్చి, జూలై నెలలో..ఈ 5 నెలల్లోనూ.. ఫర్టిలైజర్ల ఇన్‌పుట్ కాస్ట్‌ దాదాపు 25% వరకు (మ్యూరియేట్ ఆఫ్ పొటాష్)పెరిగింది. ఈ భారం ఎరువుల ఉత్పత్తుల కంపెనీలపై పడకుండా..ఎన్బీఎస్ తో పరిహారం అందించేందుకు కేంద్రం దశలవారీగా నిధులు విడుదల చేస్తోందని, కేంద్ర కేబినెట్ రూ.37,952 కోట్లను 2025-26 రబీకి విడుదల చేయాలని నిర్ణయంచడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతులకు ఎరువుల కొరత ఉండకూడదనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయం, ఆ తర్వాత నెలకొన్న జియోపొలిటికల్ సమస్యల సందర్భంలోనూ.. ఎరువుల కొరత దేశంలో లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీంతో తెలంగాణ రైతులకు కూడా మేలు జరుగుతోందన్నారు.

Also Read: Telangana: ‘దూపదీప నైవేథ్యం’ స్కీమ్‌.. ఆలయాల నుంచి భారీగా దరఖాస్తులు.. అధికారుల మల్లగుల్లాలు!

తెలంగాణలోని రామగుండం

తెలంగాణలోనూ రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్రం అందుబాటులో ఉంచిందని, 2025 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 9.8 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా 10.28 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచిందన్నారు. మొత్తంగా 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా(Urea) అమ్ముడయినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని, గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే.. 13వేల మెట్రిక్ టన్నుల ఎక్కువగా అమ్ముడయ్యాయన్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతోపాటుగా.. విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా.. దేశంలో యూరియా కొరత తగ్గించేందుకు కేంద్రం చొరవతీసుకుందన్నారు. తెలంగాణ(Telangana)లోని రామగుండం(Ramagundam)లోని ఆర్ఎఫ్సీఎస్(RFCS) లో వివిధ కారణాలతో ఆగిన ఎరువుల ఉత్పత్తిని కేంద్రం పునరుద్ధరించిందన్నారు. ఆర్ఎఫ్సీఎల్ మొత్తం సామర్థ్యం రోజుకు.. 3,850 మెట్రిక్ టన్నులు కాగా.. అక్టోబర్ 2 (దసరా) నుంచి సామర్థ్యంలో 90% ఉత్పత్తి అంటే 3,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ప్రారంభమైందని, ఇందులో 45% తెలంగాణ రైతాంగం కోసం కేటాయించిందన్నారు.

హైడ్రోజన్ వాయువు లీకేజీ..

రామగుండం ఎరువుల కర్మాగారంలో సింథటిక్ గ్యాస్ లీకేజీ కారణంగా.. 2025 ఆగస్టు 14 నుంచి ఉత్పత్తి ఆగిందని, విదేశాల నుంచి నిపుణులు రంగంలోకి దిగిన తర్వాత హైడ్రోజన్ వాయువు లీకేజీని ఆపి.. పలు పరీక్షల అనంతరం.. దసరా నుంచి ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. అక్టోబర్ లో లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 45వేల మెట్రిక్ టన్నులు తెలంగాణకు కేటాయించారన్నారు. విషవాయువుల లీకేజీని అరికట్టడంలో పనిచేసిన ప్రతి కార్మికుడికీ ధన్యవాదాలని తెలిపారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉత్పత్తి ప్రారంభం కావడంపై మళ్లీ తెలంగాణ రైతాంగానికి అవసరమైనంతమేర యూరియా అందుబాటులోకి రావడం సంతోషకరం అన్నారు.

Also Read: Uttam Kumar Reddy: తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల పునరుద్దరణకు ప్రభుత్వం కసరత్తు

Just In

01

VC Sajjanar: వాట్సప్‌లో సజ్జనార్ అప్‌డేట్స్.. ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు

KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ కు గుణపాఠం చెప్పాలి.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Hydra: రూ. 39 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా!

Pawan Kalyan: మొంథా తుపాను నేపథ్యంలో అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు

GHMC Commissioner: ఎన్నికల నిబంధన ప్రకారమే విధులు నిర్వర్తించాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్