Cheater-Escape (Images source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Conman Escape: తప్పించుకున్నాడా?, తప్పించారా?.. ఘరానా మోసగాడి పరారీలో ఎస్సైపై అనుమానం?

Conman Escape: చిక్కినట్టే చిక్కి పరారైన ఘరానా మోసగాడు

ఓ ఎస్​ఐ పాత్రపై అనుమానాలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మద్యంతో పాటు వేర్వేరు వ్యాపారాల పేరిట జనాన్ని వందల కోట్లకు ముంచి పరారైన ఓ ఘరానా మోసగాడు (Conman Escape) పోలీసులకు చిక్కినట్టే చిక్కి పరారయ్యాడు. అయితే, ఈ వ్యవహారంలో  ఓ సబ్​ ఇన్స్‌పెక్టర్ పాత్ర పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు మోసగాడితో భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకున్న ఆ సబ్-ఇన్స్‌పెక్టర్ పారిపోవటానికి సహకరించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. సదాశివపేటకు చెందిన ఓ వ్యక్తి మద్యంతో పాటు వేర్వేరు వ్యాపారాల పేరిట హైదరాబాద్‌కు చెందిన వారితోపాటు పలువురి నుంచి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు తీసుకుని నిలువునా ముంచాడు. ఆ తరువాత కనిపించకుండా పోయాడు.

చాలా రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని పట్టుకునే బాధ్యతలను పోలీసు ఉన్నతాధికారులు టాస్క్​ ఫోర్స్‌కు అప్పగించారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణ ప్రారంభించిన ఈ బృందం పరారీలో ఉన్న నిందితుడు ముంబయిలో ఉన్నట్టుగా నిర్ధారించుకుంది. ఆ తరువాత ఓ సబ్ ఇన్స్ పెక్టర్ నేతృత్వంలో కొందరు సిబ్బంది ఘరానా మోసగాన్ని పట్టుకునేందుకు అధికారిక వాహనంలో ముంబయి వెళ్లారు. గురువారం అతడిని అదుపులోకి కూడా తీసుకున్నారు. హైదరాబాద్ తీసుకొస్తుండగా సదరు నిందితుడు సదాశివపేటలో పోలీసులకు మస్కా కొట్టి ఉడాయించాడు.

Read Also- DGP Shivdhar Reddy: మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో తెలంగాణ డీజీపీ కీలక వ్యాఖ్యలు

ఎస్ఐ పాత్రపై అనుమానాలు…

అయితే, దీంట్లో ఓ సబ్​‌-ఇన్స్‌ పెక్టర్​ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటే పోలీసులు అధికారిక వాహనంలోనే తీసుకుకొస్తారు. నిందితుడితోపాటు ఇద్దరు ముగ్గురు సిబ్బంది ఉంటారు. అయితే, ప్రత్యేక బృందానికి సారధ్యం వహించిన సబ్​ ఇన్స్‌పెక్టర్​ తనతోపాటు వచ్చిన సిబ్బందిని పోలీసుల అధికారుల వాహనంలో పంపించాడు. తాను మాత్రం నిందితుడి వాహనంలో హైదరాబాద్ బయల్దేరాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే నిందితుడితోపాటు ఉన్న సబ్- ఇన్స్‌పెక్టర్​ పోలీసులు ప్రయాణిస్తున్న కారుతోపాటు కాకుండా, ముందుగానే రావడం. సదాశివపేటలో నిందితుడు తన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించారు. దారిలో ఉండగానే కుటుంబీకులకు ఫోన్​ చేసిన నిందితుడు సదాశివపేటలోని ఓ హోటల్‌కు రావాలని వారికి చెప్పడం అనుమానాస్పదంగా ఉంది.

Read Also- Bigg Boss Telugu 9: ఓవర్ కాన్ఫిడెంట్ పేరుతో రగులుతోన్న హౌస్.. గౌరవ్, భరణిలకు దివ్య ఇచ్చిపడేసింది

హోటల్ వద్దకు చేరుకున్న తరువాత కుటుంబ సభ్యులను కలిసి వస్తానని నిందితుడు లోపలికి వెళ్లగా సబ్-ఇన్స్‌పెక్టర్​ మాత్రం బయటే వాహనం వద్ద ఉండిపోవటం ఇవన్నీ అనుమాస్పదంగా మారాయి. కాగా, హోటల్ లోపలికి వెళ్లిన నిందితుడు ఎంతకూ తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చింది. ఈలోపు అధికారిక వాహనంలో వస్తున్న పోలీసులు కూడా హోటల్ వద్దకు చేరుకున్నారు. అంతా కలిసి హోటల్ మొత్తం వెతికినా నిందితుడు మాత్రం కనిపించ లేదు. దాంతో కుటుంబ సభ్యులతో కలిసి అతను పరారైనట్టు గుర్తించారు. నిందితునితో భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకుని సదరు సబ్-ఇన్స్​‌పెక్టర్ ఈ విధంగా వ్యవహరించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు అసలేం జరిగిందన్నది తెలుసుకోవటానికి అంతర్గత విచారణ జరుపుతున్నారు. ఇక, పరారైన ఘరానా మోసగాన్ని పట్టుకునేందుకు మళ్లీ అయిదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Just In

01

IND vs AUS 1st T20I: వరుణుడి సడెన్ ఎంట్రీ.. భారత్ – ఆసీస్ తొలి టీ20 రద్దు.. తర్వాతి మ్యాచ్ ఎప్పుడంటే?

Mahabubabad SP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కీలక సూచనలు

Azharuddin: నిజమా!.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి?.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ఊహించని ట్విస్ట్?

Mahabubabad: తుఫాన్‌ను జయించిన తెగువ.. రెండు ప్రాణాలకు పునర్జన్మ ఇచ్చిన 108 యోధులు!

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వాన.. రంగంలోకి నగర కమిషనర్లు.. క్షేత్రస్థాయిలో పర్యటన