Kavitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై.. కవిత సంచలన వ్యాఖ్యలు
Kavitha ( image credit: twitter)
Political News, Telangana News

Kavitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై.. కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ సందర్శించడానికి వెళ్తున్న సందర్భంలో బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారి షాద్‌నగర్ వద్ద రంగారెడ్డి జిల్లా జాగృతి నియోజకవర్గ ఇంచార్జ్ చీమల రమేశ్ కురుమ, ఆద్వర్యంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోళ శ్రీనివాస్,మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తపా తదితలతో కలిసి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు జవాబుగా తెలంగాణలో జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గెలుపు ఓటముల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిలేదన్నారు. జాగృతి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ యాత్రను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. 

Also Read: Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రాజెక్టు కు సంబంధించి జరుగుతున్న నిర్లక్ష్యం

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేవలం ఉచిత బస్సులు మాత్రమే ఇచ్చి మిగతా ముఖ్యమైన హామీలు పింఛన్లు ఇండ్లు తదితర అంశాల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కవిత విమర్శించారు. ప్రజలను మేల్కొల్పి వారిలో చైతన్యం తెచ్చే విధంగా తన పర్యటనలు కొనసాగుతాయని ఆమె సందర్భంగా తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించి జరుగుతున్న నిర్లక్ష్యం పై నిలదీసేందుకు తమ పోరాటాలు కొనసాగుతాయని ఆమె అన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి విభాగం ప్రధాన కార్యధర్శి రాం కోటీ, రాష్ట్ర యంబిసి అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, అందుగుల సత్యనారాయణ,ఉదయ బాను షాద్‌నగర్ పట్టణ అధ్యక్షుడు మహేష్, కేశంపేట్ మండల అధ్యక్షుడు వెంకటయ్య,కొత్తూరు కుమార్ మండల అధ్యక్షుడు వీరయ్య, చౌదర్ పల్లి మండల అధ్యక్షుడు అంజీ కురమ , పరూక్ నగర్ మండల అధ్యక్షుడు మల్లేశ్,నరేందర్ గోపు వర్ష జాగృతి శ్రేణులు, మహిళలు మంగళ హరతులతో ఘన స్వాగతం పలికారు.

Also ReadKavitha: జాబ్ క్యాలెండర్ హామీ అమలయ్యే వరకు ఒత్తిడి చేస్తాం.. కవిత కీలక వ్యాఖ్యలు

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం