Election Commission: దేశవ్యాప్తంగా సమగ్ర ఓటర్ జాబితా సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కీలక ప్రకటన చేసింది. ఫేజ్ 2లో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గోవా, అండమాన్, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లో నేటి నుంచి ఈ సర్వే ప్రారంభం కానున్నది. ఈ మేరకు సోమవారం సీఈసీ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar) మీడియాకు వివరాలు వెల్లడించారు.
తొలి విడుత సక్సెస్
ఓట్ల సవరణకు సంబంధించి బిహార్(Bihar)లో తొలి విడుత నిర్వహించామని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఆ సర్వే విజయవంతమైందని చెప్పారు. బూత్ స్థాయి నుంచి ఓటర్ లిస్ట్ ప్రక్షాళన చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 1951 నుంచి 2004 మధ్య కాలంలో 8 సార్లు మాత్రమే ఎస్ఐఆర్ సర్వే జరిగిందని వివరించారు. బిహార్‌లో జరిపిన సర్వేలో 7.5 కోట్ల మంది పాల్గొన్నారని చెప్పారు. తొలగించిన ఓట్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. మరణించిన, వలస వెళ్లిన, ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న ఓట్లను తొలగించినట్టు చెప్పారు. ఓటర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.
Also Read: Killer Movie: విడుదలకు సిద్ధం అవుతున్న లేడీ సూపర్ హీరో ఫిల్మ్.. ఏంటంటే?
ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా
ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్ లిస్ట్‌ను సీజ్ చేస్తున్నట్టు సీఈసీ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారంలు వచ్చిన తర్వాత ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో బూత్ లెవల్ అధికారులదే కీలక పాత్రగా చెప్పారు. డిసెంబర్ 4 వరకు ఎస్ఐఆర్, డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.
Also Read: Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ
