Chandampet Government School (Image Source: X)
తెలంగాణ

Medak: ప్రభుత్వ పాఠశాలకు నీటి శుద్ధి యంత్రాన్ని అందజేసిన హెడ్ మాస్టర్.. ఎక్కడంటే?

Medak: తాను పనిచేసే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నీటి శుద్ధి యంత్రాన్ని (Water Purifier) స్కూల్ ప్రధానోపాధ్యాయుడైన (Headmaster) మల్లగారి శ్రీనివాస్ రెడ్డి (Mallagari Srinivas Reddy).. తన సోదరుడు, వ్యాపారవేత్త అయిన మల్లగారి రవీందర్ రెడ్డి‌ (Mallagari Ravinder Reddy)తో కలిసి అందించారు. ఇది చిన్న శంకరంపేట మండలం చందంపేట ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. సోమవారం జిల్లా విద్యాధికారి రాధాకిషన్ వాటర్ ప్లాంటును ప్రారంభించి విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మాట్లాడుతూ.. మల్లగారి శ్రీనివాస్ రెడ్డి హెడ్మాస్టర్‌గా పనిచేసే చందంపేట ప్రభుత్వ పాఠశాలకు తన సోదరుడితో కలిసి నీటి శుద్ధి యంత్రాన్ని ఉచితంగా అందించడం అభినందనీయమని ప్రశంసించారు. పాఠశాల విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు.

Also Read- Ramchander Rao: రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయింది.. రౌడీ షీటర్లపై కేసుల ఎత్తేసి ఫించన్లు కూడా ఇస్తారు

సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లగారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమాజం నుండి మనం అభివృద్ధి చెందాము. ఆ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులు రవీందర్ రెడ్డితో కలిసి నీటి శుద్ధి యంత్రాన్ని పాఠశాలకు అందించామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు సాయి రెడ్డి, ఉపాధ్యాయులు, ఎన్, శ్రీధర్, జి శివప్రసాద్, ఎస్ సంతోష్, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

K Laxman: పంపకాల తగదాలతోనే కాంగ్రెస్ పాలన.. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్

Jubilee Hills By-Election: చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్.. మరో 100 మందికి పైగా రౌడీషీటర్లు కూడా!

Kurnool Bus Accident: కర్నూలు జిల్లా‌ బస్ యాక్సిడెంట్ మృతులైన తల్లికూతుర్లకు కన్నీటి వీడ్కోలు

Medak: ప్రభుత్వ పాఠశాలకు నీటి శుద్ధి యంత్రాన్ని అందజేసిన హెడ్ మాస్టర్.. ఎక్కడంటే?

Ramchander Rao: రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయింది.. రౌడీ షీటర్లపై కేసుల ఎత్తేసి ఫించన్లు కూడా ఇస్తారు