Bad Boy Karthik: హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik). పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి నాగశౌర్య సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అందమైన ఫిగరు నువ్వ’ (Andhamaina Figaru Nuvvaa Lyrical) అంటూ సాగే రొమాంటిక్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పాట విషయానికి వస్తే..
Also Read- Kantara Chapter 1 OTT: ‘కాంతార: చాప్టర్ 1’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..
సాంగ్స్ లిరిక్స్‌ని గమనిస్తే..
‘‘అందమైన ఫిగరు నువ్వా.. డే టైమ్‌లో డెవిలు నువ్వా
ఓకే అంటూ కలిసిపోవా.. పొగరెక్కిన మిరపకాయా..
అమ్మడు మా లచ్ఛి.. నీకుంది బోలెడు పిచ్చి..
ఇక చుక్కలనే తెచ్చి.. మరి మాలచుడత గుచ్చి
అరె ధిల్లో.. కల్లో.. గుళ్లో.. బళ్లో.. నిన్నే చూస్తున్నా..
నువ్వు కుయ్యో.. మొర్రో.. పోపో అన్నా.. వెంటే వస్తున్నా..
అరె వినవే హసీనా.. మరి మనసు రాసీనా
అరె ఎవరు నాకన్నా.. ప్రేమించారు అంటున్నా..’’ అంటూ సాగిన ఈ పాటకు హారీస్ జయరాజ్ (Harris Jayaraj) అందించిన బాణీలు వినసొంపుగా ఉన్నాయి. ఈ పాటకు కృష్ణకాంత్ ఆకట్టుకునే సాహిత్యం అందించగా.. శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి. అలాగే ఈ సాంగ్‌లో నాగ శౌర్య, విధి కెమిస్ట్రీ యూత్‌ను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోంది.
Also Read- Megastar Chiranjeevi: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!
నాగశౌర్య కెరీర్‌కు ఎంతో కీలకం
నాగశౌర్య, విధి (Vidhi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ డీవోపీగా, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాపై నాగశౌర్య ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా హిట్టవడం ఆయన కెరీర్‌కు ఎంతో ముఖ్యం కూడా. ఎందుకంటే, గత కొంతకాలంగా నాగశౌర్య సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ, హిట్టు మాత్రం ఆయనకు రావడం లేదు. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టి చూపిస్తాననే నమ్మకాన్ని నాగశౌర్య అండ్ టీమ్ వ్యక్తం చేస్తుంది. చూద్దాం.. మరి శౌర్యకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను ఇస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
