Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఈ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే విషయమై బాగా వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా దీపావళి వేడుకలను బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఈ రూమర్స్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ విషయంపై ఆమె ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలా అని వినిపిస్తున్న వార్తలను ఖండించనూ లేదు. కానీ, ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్న ఫోటోలు తరచుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, సమంత సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి, ప్రొడక్షన్ నెంబర్ 1గా ‘శుభం’ (Subham) అనే సినిమాను చేసింది. ఇప్పుడు అదే బ్యానర్‌లో సమంత (Samantha) ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం మొదలైంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా ఫొటోలను, ఓ వీడియోను విడుదల చేశారు. వీటిలో కూడా సమంత పక్కనే రాజ్ నిడిమోరు ఉండటం గమనించవచ్చు. ఆయన ఈ సినిమాను సమర్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read- Megastar Chiranjeevi: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!
‘మా ఇంటి బంగారం’తో రీ ఎంట్రీ
సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures) బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్ ఎప్పటి నుంచో వార్తలలో ఉంటూనే ఉంది. ఈ ఫొటోలు, వీడియోలు చూస్తుంటే.. దసరా నుంచే ఈ సినిమాను స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫొటోలు, వీడియోలలో సమంత చాలా న్యాచురల్‌గా కనిపిస్తోంది. ‘ఓ బేబీ’, ‘జబర్దస్త్’ వంటి చిత్రాలతో దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న నందినీ రెడ్డి (Nandini Reddy) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన ‘శుభం’ అనే సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో.. మొదటి చిత్రంతోనే సమంత సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడామె బ్యానర్‌లో రాబోతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె రీ ఎంట్రీ కోసం, అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలియంది కాదు.
Also Read- Kantara Chapter 1 OTT: ‘కాంతార: చాప్టర్ 1’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..
అభిమానుల కోరిక ఇదే..
వాస్తవానికి ‘మా ఇంటి బంగారం’ అనౌన్స్‌మెంట్ ఎప్పుడో వచ్చింది. అనౌన్స్‌మెంట్‌తో విడుదల చేసిన పోస్టర్ ఇప్పటికీ వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇందులో గన్ పట్టుకుని సమంత ఇచ్చిన పోజుకు అంతా ఆశ్చర్యపోయారు. సమంత కెరీర్‌లో బ్లాస్టింగ్ ఫిల్మ్ రాబోతుందంటే వార్తలైతే సంచరిస్తూ వచ్చాయి కానీ, సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనేది క్లారిటీ లేకుండా పోయింది. అలా డౌట్స్‌లో ఉన్న ఈ సినిమాను, సెట్స్‌పైకి తీసుకెళ్లడంతో.. సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి సైలెంట్‌గానే సినిమా అంతా షూట్ చేస్తారో.. లేదంటే మధ్యమధ్యలో ఏమైనా ప్రమోషనల్ కంటెంట్ వదులుతారో అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో సమంత మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవ్వాలని ఆమె అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
Started our journey with the Muhurtham of #MaaIntiBangaram, surrounded by love & blessings. ✨
We can’t wait to share with you what we’re creating… need all your love and support as we begin this special film. ❤️#MIB #Samantha #TralalaMovingPictures @TralalaPictures… pic.twitter.com/PwICPNsP8R— Samantha (@Samanthaprabhu2) October 27, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
