Gummadi Narsaiah: నిరాడంబరతకు, నిజాయితీకి మారుపేరైన తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (Ex-MLA Gummadi Narsaiah) జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, సామాన్య జీవితం గడిపిన ఈ ప్రజా నాయకుడి బయోపిక్ నిర్మాణ ప్రకటన తెలుగు సినీ పరిశ్రమలో చర్చకు దారితీసింది. అయితే, ఈ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (శివన్న)ను ఎంచుకోవడంపై టాలీవుడ్ సర్కిల్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విడుదలైన ‘గుమ్మడి నర్సయ్య’ సినిమా మోషన్ పోస్టర్‌లో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) పంచెకట్టులో, భుజంపై ఎర్ర కండువా, చేతిలో సైకిల్‌తో చాలా అథెంటిక్‌గా కనిపించారు. ఎమ్మెల్యేలంతా కార్లలో అసెంబ్లీకి వస్తుంటే, నర్సయ్య మాత్రం సైకిల్‌పై వచ్చే దృశ్యాన్ని మోషన్ పోస్టర్‌లో చూపించారు. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని, నిరాడంబరతను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read- Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!
నర్సయ్య కథ నచ్చలేదా?
అయితే, ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో తెలుగు నేలకు చెందిన ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడి పాత్రను కన్నడ నటుడు పోషించడంపై తెలుగు ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా సోషల్ మీడియాలో, అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గుమ్మడి నర్సయ్య లాంటి ఒక ప్రజా నాయకుడి బయోపిక్ చేయడానికి సరైన నటుడు లేడా? లేదా కమర్షియల్ హంగులు లేని ఇటువంటి నిజాయితీ కథలను చేయడానికి తెలుగు హీరోలు ముందుకు రాలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా బయోపిక్‌లు అనగానే ఆ నాయకుడికి ఉన్న గ్లామర్, రాజకీయ పలుకుబడి ఆధారంగానే తెలుగులో ఎంపిక జరుగుతుందనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో, ప్రజా సేవనే జీవితంగా భావించిన నర్సయ్య కథను తెలుగు హీరోలు పట్టించుకోలేదా? అనేది చర్చనీయాంశమైంది.
Also Read- Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?
తెలుగు అగ్ర హీరో చేసి ఉండే బాగుండేది..
స్వార్థపూరిత రాజకీయాలు రాజ్యమేలుతున్న నేటి కాలంలో, గుమ్మడి నర్సయ్య వంటి వ్యక్తి జీవిత చరిత్ర (Gummadi Narsaiah Biopic) సినిమాగా వస్తే లక్షలాది మందికి స్ఫూర్తిని ఇస్తుందనడంతో అసలు సందేహమే అవసరం లేదు. ఆయన గురించి తెలియని వారు కూడా ఎంతో తెలుసుకుంటారు. ఇలాంటి సినిమాను తెలుగులో ఎవరైనా అగ్ర హీరో చేసి ఉంటే.. చాలా మంచి మెసేజ్ ఇచ్చిన వారు అయ్యుండేవారు. కానీ ఎవరూ ముందుకు రాకపోవడం విడ్డూరం. మరోవైపు, శివరాజ్ కుమార్ వంటి సీనియర్, పాన్-ఇండియా స్టార్ ఈ పాత్ర పోషించడం వల్ల సినిమాకు మంచి గుర్తింపు, అధిక సంఖ్యలో ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎలా చూసినా, గుమ్మడి నర్సయ్య లాంటి ఆదర్శప్రాయమైన వ్యక్తి జీవితాన్ని వెండితెరపై చూడబోతున్నందుకు, చూపించబోతున్నందుకు మేకర్స్‌కు ధన్యవాదాలు చెప్పక తప్పదు. ఈ చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్ తెలుగు, కన్నడ సహా పలు భాషల్లో విడుదల కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
