RAM-CHARAN( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Ram Charan Next movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది తర్వాత తీయబోయే సినిమాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ బడా దర్శకుల పేర్లు వినిపించినా.. చివరికి కోలీవుడ్ దర్శకుడికి ఫిక్స్ అయ్యేలా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ తర్వాత తీయబోయే సినిమాకు తమిళ సినిమా దిగ్గజం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ కాంబోలను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా అధికారికంగా లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది నెల్సన్‌కు ‘జైలర్ 2’ తర్వాత చేసే తదుపరి సినిమా అవుతుందని సమాచారం. ఈ ప్రకటన సోషల్ మీడియాలో భారీ బజ్‌ను రేపింది.

Read also-Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

నెల్సన్ దిలీప్‌కుమార్ తన డైరెక్షన్‌లో ‘జైలర్’తో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఆ సినిమా పాన్-ఇండియా హిట్ అయి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ‘జైలర్ 2’ షూటింగ్‌లో ఉన్న నెల్సన్, ఆ తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెడుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్లకు ప్రసిద్ధి చెందిన ఈ బానర్, ఈసారి తెలుగు, తమిళ మార్కెట్‌ను కట్టిపడేసేలా ప్లాన్ చేస్తోంది. రామ్ చరణ్, ‘ఆర్ఆర్ఆర్’తో హాలీవుడ్‌లో కూడా మార్క్ చేసుకున్న హీరో. అతని యాక్షన్, డ్యాన్స్, ఎమోషనల్ రోల్స్‌కు ఫ్యాన్స్ పిచ్చిపడతారు. ఇక అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్? ‘జైలర్’, ‘విక్రమ్’, ‘జావాన్’ వంటి సినిమాల్లో అతని బీట్స్ స్క్రీన్‌ను వణికించాయి. ఈ ముగ్గురు కలయికపై మరింత హైప్ పెరుగుతోంది.

Read also-Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..

సౌత్ ఇండియన్ సినిమా ప్రస్తుతం పాన్-ఇండియా ట్రెండ్‌లో ఉంది. ‘పుష్ప 2’, వంటి తెలుగు ఫిల్మ్స్ బాక్సాఫీస్‌ను కుమ్ముస్తున్నాయి. ఇక్కడ రామ్ చరణ్ హీరోగా, నెల్సన్ డైరెక్టర్‌గా, అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటే ఇది తెలుగు, తమిళ, హిందీ మార్కెట్స్‌ను కవర్ చేస్తుంది. లైకా ప్రొడక్షన్స్ ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్స్‌లో ఎప్పుడూ విజయవంతమవుతుంది, కాబట్టి ఈ సినిమా 2027లో రిలీజ్ అయితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా సగానికి పైగా పూర్తయింది. ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు నిర్మాతలు. నవంబర్ మొదటి వారంలో ఒక సాంగ్ కూడా విడుదల కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27, 2026 వ తేదీన విడుదల కానుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏఆర్ రెహమాన్ ఇప్పటికే ఇచ్చిన సాంగ్ అదిరిపోతాయని, పలు సందర్భాల్లో దర్శకుడు తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!