aryan( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..

Aryan second single: బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల‌ భర్తగానే కాకుండా, నటుడిగానూ విష్ణు విశాల్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘ఆర్యన్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పాట మంచి మెలొడీగా ప్రేక్షకులను అలరించనుంది. ముఖ్యంగా మాస్ మహారాజ్ తో (నిర్మాతగా) సినిమాలు చేస్తూ.. మంచి హిట్స్ కూడా అందుకున్నారు విష్ణు విశాల్. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తర్వాత ‘ఆర్యన్’గా ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శుభ్ర, ఆర్యన్ రమేష్‌తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-AI photo controversy: దీపావళికి దీపికా పదుకోణె చూపించిన ‘దువా’ ఫోటో నిజం కాదా!.. మరి ఏంటంటే?

‘రాట్ససన్’ విజయం తర్వాత విష్ణు విశాల్ మరోసారి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా.. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒక యూనిక్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి, విష్ణు విశాల్ నటించిన FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ సహ రచయిత వ్యవహరించడం విశేషం. ‘ఆర్యన్’ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని తెలియజేయడానికి, మేకర్స్ అన్ని రకాల ప్రమోషనల్ ఈవెంట్స్‌ను చేసేందుకు రెడీ అవుతున్నారు.

Read also-Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

విడుదలైన పాటను చూస్తుంటే.. పరిచయమే.. పదనిసలా మారిన తీరే బాగుందే..అరకొరగా వినపడుతుందే కొత్తగా నాకే నా గొంతే అంటూ మొదలవుతోంది పాట. సామ్రాట్ అందించిన లిరిక్స్ కొత్తగా ఉన్నాయి. చలా రోజుల తర్వాత చాలా ఫ్రెష్ లుక్ తో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జిబ్రాన్, అబ్బీ, బ్రిత్తా.. అందించిన ఓకల్స్ పాటకు మరింత బలాన్ని ఇచ్చాయి. హీరో హీరోయిన్ ల మధ్య బాండింగ్ కూడా చాలా బాగా కుదిరింది. మొత్తంగా ఈ పాటను చూస్తుంటే మరో మొలొడీ హిట్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ పాటతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Just In

01

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది

Maoists Surrender: మావోయిస్టులకు మరో భారీ షాక్.. పెద్ద సంఖ్యలో సరెండర్.. ఎక్కడంటే?

Migraine Relief: ఇంట్లో ఉండే వాటితోనే మైగ్రేన్ తలనొప్పికి ఇలా చెక్ పెట్టేయండి!

Killer Movie: విడుదలకు సిద్ధం అవుతున్న లేడీ సూపర్ హీరో ఫిల్మ్.. ఏంటంటే?