allamma( image:X)
ఎంటర్‌టైన్మెంట్

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Ellamma movie: బలగం వేణు బలగం తర్వాత తీయబోయే చిత్రం ‘ఎల్లమ్మ’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఈ కథ ఇప్పటివరకూ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లి చివరకు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ వద్దకు చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ముందు అనుకున్న సంగీత దర్శకుడిని తొలగించారని సమాచారం. ఆయన స్థానంలో హీరోగా చేస్తున్న దేవీ శ్రీ ప్రసాదే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా చేయనున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ కు జోడీగా కీర్తీ సురేశ్ నటించబోతుందని సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. మొదటి నుంచీ ‘ఎల్లమ్మ’ సినిమాకు కష్టాలు తప్పలేదు. మొదట ఈ సినిమాలో హీరోగా నాని అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నితిన్ అనుకున్నారు. అయన కూడా తప్పుకున్నట్లు సమాచారం. మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకున్నారు. చివరిగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఫిక్సయ్యారు.

Read also-Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..

నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న కమెడియన్ వేణు బలగం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే తన రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ను దిల్ రాజు బేనర్ లో తెరకెక్కిస్తున్నాడు. 2023లో విడుదలై, కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసులు ఆకర్షించిన ‘బలగం’ తర్వాత, వేణు మరో గ్రామీణ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘ఎల్లమ్మ’ (Ellamma) సినిమా, గ్రామీణ దేవత ఎల్లమ్మను కేంద్రంగా చేసుకుని, ఒక దళిత సముదాయానికి చెందిన పాట సమూహం భావోద్వేగ యాత్రను చిత్రిస్తుంది. ఈ కథలో వారి కలలు, కష్టాలు, ఆధ్యాత్మికత మధ్య సంఘర్షణలు ముఖ్యమైనవి. వేణు, నిజ జీవితాల నుంచి ప్రేరణ పొంది ఈ కథను రూపొందించారు.

Read also-AI photo controversy: దీపావళికి దీపికా పదుకోణె చూపించిన ‘దువా’ ఫోటో నిజం కాదా!.. మరి ఏంటంటే?

ప్రొడక్షన్ విషయానికి వస్తే, ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు మించుతుందని అంచనా. కాస్టింగ్ డిలేల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుంది. డీఎస్‌పీ లాక్ అయ్యాక, డిసెంబర్, 2025లో షూట్ స్టార్ట్ కావచ్చని సినిమా పెద్దలు అంచనా వేస్తున్నారు. వేణు యెల్డండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ ఒక ఎమోషనల్ ఫీస్ట్‌గా ఉంటుందని నిర్మాత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బలగం లాంటి సక్సెస్ కొనసాగితే, ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. తాజా బజ్‌తో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు హీరో హీరోయిన్ కూడా ఫిక్స్ అవడంతో సినిమా పట్టాలెక్కించడాని సిద్ధంగా ఉంది. తాజాగా శ్రీవారిని దర్శంచుకున్న వేణు సినిమా గురించి రెండు మూడు వారాల్లో అప్డేట్ వస్తుందన్నారు. వచ్చే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు