Liquor License (imagecredit:twitter)
తెలంగాణ

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Liquor License: వైన్​ షాపులకు సంబంధించి డ్రా నిర్వహించడానికి హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, తుది తీర్పునకు లోబడి కేటాయింపులు ఉండాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు రెండేళ్లపాటు లైసెన్స్(License) ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన దరఖాస్తులు చేసుకోవడానికి చివరి గడువుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, మధ్యలో పండుగ సెలవులు రావడం, బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంలో బంద్​ జరగడంతో ఎక్సైజ్​ అధికారులు ఈ నెల 23వ తేదీ వరకు గడువు పెంచారు.

దీనిని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టు(High Cort)లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టులో శనివారం వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం గడువు పెంపు పిటిషన్లపై న్యాయస్థానం తీర్పును రిజర్వ్​ చేసింది. అయితే, వైన్ షాపుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. తుది తీర్పునకు లోబడి కేటాయింపులు ఉండాలని తెలిపింది. జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా రేపు ఉదయం 11 గంటలకు మద్యం షాపులకు డ్రా ప్రక్రియ నిర్వహించనున్నారు.

Also Read: Harish Rao: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటం

ఈసారి షాక్.. 

తెలంగాణలో ఎక్సైజ్ శాఖకు టెండర్ దాఖలు చేసే మద్యం వ్యాపారులు ఈసారి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు కొనసాగిన మద్యం నోటిఫికేషన్(Alcohol notification) టెండర్ దాఖలులలో ఎప్పుడూ కూడా దరఖాస్తులు తగ్గలేదు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గలేదు. కానీ, ఈసారి మద్యం వ్యాపారులు దరఖాస్తులు వేసేందుకు సరైన మక్కువ చూపలేదు. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైనప్పటికీ చివరి మూడు రోజులు మాత్రమే ఎక్సైజ్ అధికారులు ఆశించిన మేర దరఖాస్తులు టెండర్ల కోసం వచ్చాయి. విచిత్రం ఏంటంటే లాస్ట్ చివరి రోజులు మాత్రం టెండర్లు వేయడానికి యజమానులు బారులు తీరారు. ఉహించి దానికంటే ఎక్కవ గానే టెండర్లు దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: OTT Movie: సముద్ర జలాల్లో సస్పెన్స్ థ్రిల్లర్.. సింగిల్ లేడీ అదరగొట్టింది మామా..

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు