Ashanna: ఆపరేషన్ కగార్(Operation Kagar) నేపథ్యంలో ఈ మధ్య కీలక మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఆశన్న అలియాస్ రూపేశ్(Rupesh) ఒకరు. ఈయన లొంగుబాటు తర్వాత మావోయిస్ట్ పార్టీ ఆయన్ను ద్రోహిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆశన్న శనివారం స్పందించారు. తమ లొంగుబాటుపై పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తాము కోవర్టులుగా పని చేసి పార్టీకి ద్రోహం చేశామన్న ఆరోపణలు సరైనవి కావన్నారు. సాయుధ పోరాటాన్ని విరమించాలనే నిర్ణయం మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు(Namballa Kesava Rao) (బస్వరాజ్) బతికుండగానే జరిగిందని తెలిపారు.
Also Read: Samudrika Shastra: ముఖం చూసి వాళ్ళు ఎలాంటోళ్లో ఇట్టే చెప్పేయొచ్చు.. ఎలాగో తెలుసా?
తప్పుడు నిర్ణయం తీసుకోలేదు
ఆయన రాసిన చివరి లేఖను పార్టీలోని కొందరు దాచి పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. “మే 18న బస్వరాజ్ తన చివరి లేఖ పంపిన తర్వాతే ఎన్‌కౌంటర్(Encounter)లో మరణించారు. ఆ తర్వాత నేను కొందరు కేంద్ర కమిటీ సభ్యులను కలిసి ఆ లేఖను చూపించాను. మనం ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేదని, పార్టీని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బస్వరాజ్(Baswaraj) ఆ లేఖలో స్పష్టంగా రాశారు. అయితే మే 13న ఆయన కేంద్ర కమిటీ సభ్యులందరికీ రాసిన లేఖను మాత్రం ఒకరిద్దరు చదివి, మిగతా వారికి ఇవ్వకుండా దాచిపెట్టారు. ఆ లేఖ బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే ఇలా చేశారు” అని ఆశన్న సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: Gender Equality: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు బడుల్లో కీలక మార్పులు
