Konda Surekha: కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండగలా నిర్వహించాలని రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలకరించాలని మంత్రికొండా సురేఖ (Konda Surekha) ఎండోమెంటు ఉన్నతాధికారులను ఆదేశించారు. నవంబర్ 1వరకు కార్తీక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల ఈవోలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదన్నారు. ప్రతిరోజు సామూహిక కార్తీక దీపోత్సవం సాయంత్రం 6 గంటల నుంచి జరపాలని, భక్తులకు మట్టి ప్రమిదలు, వత్తులు, నూనెతో పాటుగా పసుపు కుంకుమ తాంబూలాలను మహిళా భక్తులకు అందజేయాలన్నారు.
Also Raed: Konda Surekha: నాగార్జున వివాదంతో బాధపడ్డా.. మీడియాతో ఓపెన్‌గా ఉండట్లేదు.. మంత్రి కొండా సురేఖ
దేవాలయాలలో ప్రవచనాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు
కార్తీక సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పైన పేర్కొన్న వస్తువులతో పాటు కుంకుమ, పసుపు, ఆకులు, వక్కలు, ఏదైనా పండు, కనుము ప్రధాన దేవాలయలలో భక్తులకు ఇస్తున్నట్టు తెలిపారు. సామూహిక కార్తీక దీపోత్సవంలో భక్తులు దీపాలు వదలటానికి అవసరమైనచోట తాత్కాలిక వాటర్ పాండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. నదీ పరివాహక ప్రాంతాలలోని దేవాలయాలలో నది హారతి నిర్వహిస్తున్నామని చెప్పారు. నాగఫణిశర్మ, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తో ప్రముఖ దేవాలయాలలో ప్రవచనాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాగా, ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారో అక్కడ స్థానికంగా రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్ విభాగాల సాయంతో చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మహిళలు, ఇతర భక్తులకు మంచి తాగునీటి వసతి నిర్వహించాలన్నారు. శానిటేషన్ వర్కర్స్ సేవలు వినియోగించుకోని ఆలయ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పసుపు, కుంకుమ నిర్వహణ ప్రతి టెంపుల్లో చేపట్టాలి
కుంకుమ అర్చన కార్యక్రమం పెద్దత్తున నిర్వహించాలన్నారు. పసుపు, కుంకుమ నిర్వహణ ప్రతి టెంపుల్లో చేపట్టాలన్నారు. మహిళలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ప్రవచనాలు చెప్పేటప్పుడు కూడా ఏర్పాట్లు చూడాలన్నారు. భజనమండలి, సాంప్రదాయ నాట్య మండలి సంఘాలను ఉపయోగించుకోవాలన్నారు. ఆధ్యాత్మిక కోణంలో ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. టూరిజం డిపార్టుమెంటు సహకారంతో కల్చరల్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లు సైతం పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. వయనాలు ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తించాలని సూచించారు. స్లోకాలను చిన్న చిన్న బుక్ లెట్ గా చేసి భక్తులకు ఇవ్వాలని సూచించారు. ఏవైనా ఇబ్బంది ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఎండోమెంటు ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Also Raed: Minister Konda Surekha: పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లే.. మంత్రి కొండ సురేఖ
