Kurnool Bus Accident: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బస్సులో అగ్నికీలలు ఎగసిపడి 19 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు స్పందించారు. మృతులకు కంపెనీ తరుపున ఇన్సూరెన్స్ అందిస్తామని హామీ ఇచ్చారు.
‘డ్రైవర్లు సకాలంలో స్పందించారు’
ప్రమాదం గురించి వేమూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ‘హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3.30 గం.ల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది. వర్షం కారణంగా ఓ బైకర్ స్కిడ్ అయ్యి కిందపడిపోయాడు. బైక్ పెట్రోల్ ట్యాంకర్ పగిలి మంటలు వచ్చాయి. అది బస్సుకు అంటుకొని వ్యాపించాయి. డ్రైవర్లు సకాలంలో స్పందించి అద్దాలు పగలగొట్టారు. ముందు డోర్ వైపు మంటలు ఎగసిపడుతుండంతో అటు గుండా రావడానికి ప్రయాణికులు సాహసించలేకపోయారు. బ్యాక్ డోర్ (ఎమర్జెన్సీ డోర్) గుండా చాలా మంది బయటకు వచ్చారు’ అని అన్నారు.
‘ఆ ప్రచారం నమ్మోద్దు’
బస్సుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సక్రమంగా లేవని జరుగుతున్న ప్రచారాన్ని ట్రావెల్స్ యజమాని ఖండించారు. బస్సు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ 2026 వరకూ వ్యాల్యూలో ఉందని చెప్పారు. బస్సుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు యాక్టివ్ గానే ఉన్నాయని.. ఏది కూడా గడువు మించిలేదని ధ్రువీకరించారు. కావేరీ ట్రావెల్స్ తరపున మృతులు, క్షతగాత్రులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆ డబ్బును క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. ఫ్యూజులు ఎగిరే విషయం చెప్పిన.. కర్నూలు జిల్లా ఎస్పీ!
స్పీడ్ లిమిట్ నిబంధన
మరోవైపు బస్సు ప్రమాదం ఘటనపై తెలంగాణ రవాణామంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఘాటుగా స్పందించారు. ‘బస్సులపై రోజువారిగా రవాణా శాఖ చెక్ చేస్తే వేధింపులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాదు నుండి బెంగళూరు తిరుగుతుంది. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాం’ అని పొన్నం పేర్కొన్నారు.
కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది
మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న..
బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు వివరాలు తెలుసుకోవడం జరిగింది
తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి,… pic.twitter.com/LrveQHLJsO
— Ponnam Prabhakar (@Ponnam_INC) October 24, 2025
