Mario Update (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Mario Movie: నవంబర్‌లో.. ఎ టర్బో-చార్జ్‌డ్ ర్యాంప్ రైడ్.. తాజా అప్డేట్ ఇదే!

Mario Movie: ‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ (Kalyan ji Gogana) ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడాయన నుంచి రాబోతున్న చిత్రం ‘మారియో’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్‌గా ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో.. హీరో అనిరుధ్ (Anirudh), హీరోయిన్ హెబ్బా పటేల్ (Hebah Patel) పోస్టర్‌ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా, ఈ మూవీ కోసం వేచి చూసేలా చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. ఆ అప్డేట్ ఏమిటంటే..

Also Read- Maganti Malini Devi: మాగంటి మాలినీదేవి ఎక్కడ?.. రహస్య ప్రదేశంలో దాచిన బీఆర్ఎస్ నేత ఎవరు?

పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీ.. నవంబర్‌లో రిలీజ్

‘మారియో’ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా కమర్షియల్ జానర్‌లో ఉంటూనే.. కంటెంట్ ఓరియెంటెడ్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నామని, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా, ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ (Silver Screen Productions) బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు.. సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. అలాగే పాటలు, మాటలు రాకేందు మౌళి సమకూరుస్తున్నారు. ఎమ్ ఎన్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. మణికాంత్, మదీ మన్నెపల్లి ఎడిటర్లుగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అనిరుధ్, హెబ్బా పటేల్, రాకేందు మౌళి, మౌర్య సిద్ధవరం, యష్నా ముతులూరి, కల్పిక గణేష్, మదీ మన్నెపల్లి, లతా రెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్న తారాగణం.

Also Read- Student Death: క్లాస్ రూమ్‌లో 4వ తరగతి విద్యార్థి ఆకస్మిక మరణం.. పాఠశాల యాజమాన్యంపై పేరెంట్స్ ఆగ్రహం

హెబ్బా పటేల్‌కు చాలా ఇంపార్టెంట్

ఈ సినిమా హెబ్బా పటేల్‌కు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ ఇంకొన్నాళ్లు సాగాలంటే ఈ సినిమా విజయం సాధించడం తప్పనిసరి. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన ఏ సినిమా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత ఆమెకు సరైన హిట్ పడలేదనే చెప్పుకోవాలి. ఇటీవల వచ్చిన ‘ఓదెల 2’ కూడా సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా విజయం ఆమెకు ఎంతో కీలకం. పోస్టర్స్ చూస్తుంటే సినిమా మంచి సక్సెస్ అయ్యేలానే కనిపిస్తుంది. చూద్దాం మరి ఈ సినిమాతో హెబ్బా పటేల్ ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

Baby Sale Case: దారుణం.. చెల్లిని అమ్మవద్దు అని తల్లి కాళ్ల మీద పడి వేడుకున్న కూతుర్లు.. ఎక్కడంటే?