Upasana baby shower ceremony (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Upasana: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్న ఉపాసన.. అందుకే ఈ డబుల్ సెలబ్రేషన్!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) తమ జీవితంలో అత్యంత మధురమైన మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే శుభవార్త మెగా అభిమానులతో పాటు సినీ ప్రపంచాన్ని ఆనందంలో ముంచెత్తింది. అయితే, ఈసారి ఆ సంతోషం రెట్టింపు అయ్యే అద్భుతమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ జంట త్వరలో కవలలకు (ట్విన్స్) జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించి డబుల్ ధమాకా ఇచ్చారు. దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపాసన తన సీమంతం (బేబీ షవర్) వేడుకకు సంబంధించిన క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read- Sree Vishnu: దగ్గరలో ఏదైనా బార్ ఉందా?.. శ్రీ విష్ణు హీరోయిన్.. ఇలా అడిగేసిందేంటి?

ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్న ఉపాసన

ఈ సందర్భంగా ఆమె ‘‘ఈ దీపావళి మా జీవితంలో డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్‌తో ఆనందాన్ని రెట్టింపు చేసింది’’ అంటూ గుడ్‌న్యూస్‌ను షేర్ చేశారు. ఈ క్యాప్షన్, వీడియో చివర్లో రెండు చిన్ని పాదముద్రల ఇమేజ్ ఉండటంతో… ఈ జంట కవలలకు జన్మనివ్వబోతున్నారనే విషయం స్పష్టమైంది. ఈ వార్తను రామ్ చరణ్ టీమ్ కూడా ధృవీకరించడంతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఉపాసన బేబీ షవర్ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కన్నుల పండుగలా జరిగింది. ప్రేమ, ఆనందం వెల్లివిరిసిన ఈ వేడుకకు నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖులు వారి ఫ్యామిలీతో హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. ఇద్దరు కొత్త సభ్యులను తమ కుటుంబంలోకి ఆహ్వానించడానికి రామ్ చరణ్, ఉపాసనలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

Also Read- IRCTC Tour Package: భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త.. 9 రోజుల్లో 4 జ్యోతిర్లింగాల దర్శనం.. టికెట్ ధర ఎంతంటే?

క్లీంకార‌కు తోడుగా ట్విన్స్

ఈ జంటకు ఇప్పటికే జూన్ 20, 2023న కుమార్తె క్లీంకార కొణిదెల (Klin Kaara Konidela) జన్మించిన విషయం తెలిసిందే. ఆమె రాకతో వారి బంధం మరింత బలపడింది, జీవితానికి కొత్త అర్థాన్నిచ్చింది. క్లీంకార పుట్టిన తర్వాత తమ జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ఉపాసన, రామ్ చరణ్ ఎన్నోసార్లు పంచుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ పాప ఫేస్‌ను మాత్రం వారు రివీల్ చేయలేదు. ఎప్పుడైతే క్లీంకార తనని నాన్న అని పిలుస్తుంటే అప్పుడే ఫేస్ రివీల్ చేస్తానని ఆ మధ్య ఓ షో‌లో రామ్ చరణ్ తెలిపి ఉన్నారు. ఇక ఇప్పుడు క్లీంకార‌కు తోడుగా ట్విన్స్ రాబోతుండటంతో, మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టబోతున్నారని తెలిసి, మెగా ఫ్యామిలీ అంతా డబుల్ సంతోషంతో నిండిపోయిందనే విషయం ఆ వీడియో చూస్తుంటే తెలిసిపోతుంది. ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Jubliee Hills Bypoll: జూబ్లీలో పోలింగ్ పెంచేందుకు కొత్త ప్లాన్.. రంగంలోకి యూసీడీ, స్వయం సహాయక బృందాలు!

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్