Upasana Konidela: మెగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు మెగా కోడలు ఉపాసన. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణెదల తమ రెండో సంతానానికి సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా జరిగిన సీమంతం వేడుక వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. “డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్” అంటూ ఆమె పోస్ట్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రకటన చిరంజీవి కుటుంబాన్ని మరింత ఉల్లాసంగా మార్చింది. 2012లో వివాహం జరిగిన ఈ జంటకు 2023లో మొదటి సంతానం క్లిన్ కారా జన్మించింది. ఇప్పుడు రెండోవసరి గర్భవతిగా ఉన్న ఉపాసనకు కుటుంబం సీమంతం జరిపారు.
Read also-OG movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఓజీ’.. ఎక్కడంటే?
దీనికి సంబంధించిన వీడియోను చూస్తుంటే.. ‘మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయినట్లుగా కనిపిస్తోంది. మెగా, కామినేని కుటుంబాల పెద్దలు ఈ సీమంతం కార్యాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మెగా, కామినేని కుటుంబాలనుంచి అందరూ ఈ సీమంతానికి హాజరయ్యారు. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి కూడా ఈ సీమంతంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో పవన్ కల్యాణ్ మాత్రం కనిపించలేదు. ఆయనకు బదులుగా అన్నా ఈ సీమంతానికి హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్, నాగార్జున, నయన తార కుటుంబాలు కూడా హాజరయ్యాయి.’ ఈ సందర్భంగా ఉపాసన విడుదల చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సారైనా చిరంజీవి లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడు పుడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also-OG movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఓజీ’.. ఎక్కడంటే?
This Diwali was all about double the celebration, double the love & double the blessings.
🙏🙏 pic.twitter.com/YuSYmL82dd— Upasana Konidela (@upasanakonidela) October 23, 2025
