prabhas-birthday(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Prabhas birthday: రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..

Prabhas birthday: తెలుగు చిత్ర సీమలో రెబల్ స్టార్ ఒక ప్రభంజనం. టాలీవుడ్ లో మొదలైన ప్రభాస్ ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1979లో చెన్నైలో జన్మించిన ప్రభాస్ రాజు ఉప్పలపాటి, తన ప్రతిభతో భారతీయ సినిమాల్లో ఒక ఐకాన్‌గా నిలిచాడు. ఆయన పెదనాన్న కృష్ణం రాజు కావడంతో, ఆయన సినిమాల పట్ల ఆసక్తి మరింత పెరిగింది. ప్రభాస్ కెరీర్ 2002లో ‘ఈశ్వర్’తో మొదలైంది. ‘వర్షం’ (2004), ‘చత్రపతి’ (2005), వంటి చిత్రాలు అతన్ని తెలుగు యువతల హీరోగా మార్చాయి. 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’తో ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ ఎపిక్, ప్రభాస్‌ను పాన్-ఇండియా సూపర్‌స్టార్‌గా మలిచింది. ‘బాహుబలి 2’ (2017) భారతీయ సినిమా చరిత్రలో రికార్డులు సృష్టించింది.

Read also-Gummadi Narsaiah: శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ ఏం ఉంది గురూ..

రెబల్ స్టార్ ప్రభాస్ కు మంచి స్నేహితుడు అయిన హీరో గోపీచంద్ ఇలా అన్నారు…‘ తెలుగు మూలాల నుంచి మొదలైన నీ ప్రయాణం ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఇప్పటికే నువ్వు అందరికీ అందుబాటులో ఉంటావు. అదే నిన్ను ప్రత్యేకంగా ఉంచుతుంది. కోట్లాది మందికి డార్లింగ్ నువ్వు. కింగ్ సైజ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

 

మా అధ్యక్షుడు మంచు విష్ణు.. బ్రదర్ ప్రభాస్ ఎప్పుడూ తన బలంతో, మంచి తనంతో ఉండాలని కోరుకుంటున్నాను. రాబోయే సినిమా లు బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించాలి. అంటూ రాసుకొచ్చారు.

దర్శకుడు మెహర్ రమేష్.. మంచి హృదయం కలిగిన వాడు.. కోట్లాది మంచి హృదయాల్లో డాన్, అందరికీ డార్లింగ్ మన ప్రభాస్. పుట్టిన రోజు శుభాకాంక్షలు బిల్లాకు అంటూ రాసుకొచ్చారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!