Labour Shortage (imagecredit:swetcha)
తెలంగాణ

Labour Shortage: కూలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు

Labour Shortage: రైతులను కూలీల కొరత వేధిస్తున్నది. రైతులు నానా అవస్థలు పడి పంటను వేశారు. అధిక వర్షాల కారణంగా అరకొర పంట చేతికొచ్చింది. అలా వచ్చిన పత్తిని తీసేందుకు ఇప్పుడు కూలీలు దొరక్క పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక కూలీల రేట్లు కావడంతో అసలుకే పెట్టుబడి వ్యయం అధికం కాగా దానికి తోడు కూలీల వ్యయం సైతం తోడవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట నుంచి పత్తిని వేరు చేసే పనులు ఊపందుకున్నాయి. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో పత్తి పంట అధికంగా సాగు చేయగా చేతికొచ్చిన పంటను ఏ గ్రామానికి ఆ గ్రామంలో కూలీలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో ఇతర గ్రామాల నుంచి సైతం అధిక సంఖ్యలో వచ్చి పత్తిని తీసే పనులలో కూలీలు బిజీగా ఉన్నారు. పతి నాణ్యతగా ఉన్నప్పుడే తీసుకోవడం వల్ల ఆశించిన స్థాయిలో ధర వస్తుందని రైతులు కేజీకి 15 నుంచి 18 రూపాయల దాకా ఇచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు. చలి తీవ్రత వల్ల మంచు కారణంగా పత్తి నల్లగా అవ్వకుండా పంటను తీసుకునేందుకు రైతులు మొగ్గు చూపుతుండడంతో కూలీలు సైతం కేజీల చొప్పున కావడంతో ఒక్కొక్కరు 50 నుంచి 150 కేజీల దాకా పత్తి లాగుతుండడంతో 800 నుంచి 2 వేల 250 రూపాయల దాకా రోజువారీగా కొందరికి వస్తుండడంతో పత్తి పంట వైపే కూలీలు మొగ్గుచూపుతున్నారు.

తగ్గిన దిగుబడులు..

జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో ప్రస్తుత ఖరీఫ్ పంటలో పత్తి పంటను 1.85 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. గత సంవత్సరం పత్తి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో ప్రస్తుతం రైతులు పత్తి పంట సాగుకు ఆసక్తి చూపారు. అయితే, ఇటీవల కురిసిన అధిక వర్షాలు వల్ల మొక్కలు ఎరుపు రంగుకు మారి పత్తి పంట దిగుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఎకరాకు 5 మంచి 6 క్వింటాళ్ల దిగుబడే వచ్చే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఉన్న పత్తిని తీసుకొని పంటను తీసేసి రబీలో మరో పంటను వేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

Also Read: TG Endowments Department: ఎండోమెంట్ శాఖలో అధికారుల కొరత.. 69 ఈవో పోస్టులు ఖాళీ

ఇతర పంటలకు వేధిస్తున్న కూలీల కొరత 

జిల్లాలో పత్తి(Coton) తర్వాత వరి(Pady), మిరప(Chilli), పొగాకు(Tibaco), కంది, కూరగాయల సాగుకు రైతులు మొగ్గు చూపారు. ఈ పంటల్లో కలుపులకు ఎరువులు వేసేందుకు కూలీలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పంటలో గడ్డి పెరిగి తెగుళ్ల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా కలుపు గడ్డి పెరగడంతో పురుగుల బెడద రైతులను తీవ్రంగా వేధిస్తోంది. లద్దె పురుగు పొగాకు, మిరప పంటలను తినేస్తూ పంటను నాశనం చేస్తున్నదని రైతులు వాపోతున్నారు. దీంతో వాటి బారి నుంచి పంటను రక్షించుకునేందుకు పురుగుమందులకు అధిక వ్యయం వెచ్చించి పిచికారి చేయాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల ప్రతి పంటను తీసేసి మరో పంటను సాగు చేస్తున్నారు.

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం

మేము మిరపను ప్రతి ఏటా సాగు చేస్తున్నాం. ఎన్నడూ ఇలాంటి కూలీల కొరతను చూడలేదు. ప్రస్తుత సీజన్‌లో పత్తి పంటను అధికంగా సాగు చేయడం వల్ల ఆశించిన స్థాయిలో కూలి రేట్లు గిట్టుబాటు అవుతుండడంతో కూలీలు పత్తి తీసేందుకే మొగ్గు చూపుతున్నారు. నేను వేసిన మూడు ఎకరాల మిరపలో కలుపు పెరిగి తెగులు వ్యాపిస్తోందని రాజు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: TG Weather Update: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!