Riyaz Encounter (imagecredit:twitter)
తెలంగాణ

Riyaz Encounter: రియాజ్​ ఎన్ కౌంటర్.. మానవ హక్కుల కమీషన్ కీలక ప్రకటన

Riyaz Encounter: కానిస్టేబుల్ హత్య కేసులో నిందితునిగా ఉన్న రియాజ్​ ఎన్​ కౌంటర్​(Encounter) పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(Telangana State Human Rights Commission) సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేసింది. ఎన్ కౌంటర్ కు సంబంధించి నివేదికను సమర్పించాలంటూ డీజీపీ శివధర్​ రెడ్డి(DGP Shivdhar Reddy)కి ఆదేశాలు జారీ చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకున్న మానవ హక్కుల కమిషన్ ఈ చర్యలు తీసుకుంది.

యువకునిపై కత్తితో దాడి.. 

ఈనెల 17న తనను అదుపులోకి తీసుకున్న నిజామాబాద్(Nizamabad) సీసీఎస్​ కానిస్టేబుల్ ప్రమోద్(ఊిలచేద్) ను కత్తితో పొడిచి రియాజ్(Riyaz) హత్య చేసిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న అతన్ని ప్రత్యేక పోలీసు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో కూడా రియాజ్​ తనను పట్టుకోవటానికి ప్రయత్నించిన సయ్యద్ ఆసిఫ్​(Syed Asif) అనే యువకునిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కాగా, ఘర్షణలో రియాజ్​ కు కూడా గాయాలు కావటంతో అతన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ రియాజ్​ ఓ కానిస్టేబుల్ చేతి నుంచి గన్​ లాక్కొని పారిపోవటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాల్పులు జరపటానికి కూడా సిద్ధపడ్డాడు. దాంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు.

Also Read: Travis Scott: అందుకు అమెరికన్ ర్యాపర్‌పై రగిలిపోతున్న ఇండియన్స్.. ఎందుకంటే?

పోలీసులు జరిపిన కాల్పుల్లో.. 

ఇదే విషయాన్ని మీడియాతో చెప్పిన డీజీపీ శివధర్ రెడ్డి ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయినట్టు ప్రకటించారు. దీనిపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకున్న మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 21 ప్రకారం జీవించే హక్కుకు సంబంధించి రియాజ్​ ఎన్​ కౌంటర్(Encounter) ప్రశ్నలను లేవనెత్తుతోందని కమిషన్ పేర్కొంది. నవంబర్​ 24వ తేదీలోపు ఎన్​ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులు, కేసుకు సంబంధించిన ఎఫ్​ఐఆర్(FIR), పోస్టుమార్టం నివేదికను కమిషన్​ కు అందచేయాలని డీజీపీని ఆదేశించింది.

Also Read: Liquor Shop Tender: వైన్​ షాపు దరఖాస్తులకు గడువు పెంపు.. ఎందుకంటే?

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!