Thummala Nageswara Rao ( image credit; setcha reporter)
తెలంగాణ

Thummala Nageswara Rao: నేచురల్ ఫార్మింగ్ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్య లు

Thummala Nageswara Rao: నేచురల్ ఫార్మింగ్ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తెలిపారు. రాష్ట్రంలో పత్తికొనుగోళ్లను నుంచి ప్రారంభించామన్నారు. 317 జిన్నింగ్ మిల్లులను సీసీఐ నోటిఫై చేశారని, కపాస్ కిసాన్ యాప్ తో ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని, పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

Also Read: Thummala Nageswara Rao: ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటీసీ కోర్సులు.. యువతకు కొత్త అవకాశాలు

రైతుల ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు

సెక్రటేరియట్ లో  రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాణ్యమైన పప్పుదినుసుల వంగడాలను, పొద్దుతిరుగుడు, కుసుమ వంగడాలను సబ్సిడీపై రైతులకు అందచేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర వాటాలతో అమలు అయ్యే పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామన్నారు. రైతుల ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టాయన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగం గత పదేళ్లలో దాదాపు 3000 కోట్ల మేర నష్టపోయిందన్నారు.

ప్రతి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ

రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5779 ను ఏర్పాటు చేసినట్టు, దీంతో తమ సందేహాలు లేదా ఫిర్యాదులను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైతులకు అందుబాటులో ఉంటుందని, 24 గంటలో రైతుల సమస్యకు పరిష్కరించే విధంగా ఒక సీనియర్ అధికారితో పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఏఈఓ, సెక్రటరీ, సీసీఐ ప్రతినిధి, పోలీస్ అధికారి, రైతు ప్రతినిధితో కూడిన ఒక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు, ఈ బృందాలు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పర్యవేక్షిస్తాయని వెల్లడించారు.

6,24,000 ఎకరాలలో మొక్కజొన్న పంట

మద్ధతు ధర ప్రకటించి మొక్కజొన్న పంటను కేంద్రం కొనకుండా వదిలేసిందని విమర్శించారు. కానీ రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను ఇప్పటికే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 6,24,000 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగైందన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 204 సెంటర్లు ప్రతిపాదించగా, ఇందులో 100 సెంటర్లు ప్రారంభమైనట్లు తెలిపారు. మిగతా సెంటర్లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

Also Read: Thummala Nageswara Rao: పత్తి దిగుబడిలో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శం.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది