Addanki Dayakar ( image credit: twitter)
Politics

Addanki Dayakar: బీఆర్ఎస్ ఆస్తులపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా? ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు

Addanki Dayakar: కాంగ్రెస్‌పై దాడి చేయడంలో బిజీగా ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రజల ముందే తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్  (Addanki Dayakar)మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ,  బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని వ్యాఖ్యానించారు. అవినీతిని ఆకాశాన్నంటే విధంగా తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా  దోచుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తరచూ ఏఐసీసీ, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏఐసీసీని విమర్శించే స్థాయి కేటీఆర్ కి ఉందా? ఆ స్థాయి కేటీఆర్ కి లేదని ఎద్దేవా చేశారు. మీ పార్టీ అవినీతి, మీ నాన్న కేసీఆర్ యొక్క స్వార్థపూరిత పాలన వల్లే ప్రజలు బీఆర్ఎస్‌కు తగిన బుద్ది చెప్పారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు తిరస్కరించిన ఇంకా మీ పార్టికి సోయి రాలేదా? అంటు తీవ్రంగా విమర్శంచారు. 

 Also Read: MLC Addanki Dayakar: దేశ ప్రజాస్వామ్యానికి మచ్చ కేసీఆర్.. అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్!

ఆస్తులపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా?

కేటీఆర్ కి ఇప్పుడు ఒకే పని సోషల్ మీడియా లో ఫోటోలు పోస్టు చేస్తూ కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం, అదే పని అని వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఉందని ఆశ్చర్యపోతున్నావే మరి గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీ రాజకీయ ధోరణి ఏమైంది? అప్పుడు నీకు ఎటువంటి అభ్యంతరం రాలేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు అవినీతి గురించి మాట్లాడితే అది ప్రపంచ రికార్డే అవుతుంది అని అన్నారు.  ప్రపంచంలోనే అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్‌నే అని తీవ్ర విమర్శలు చేశారు.  మీ పార్టీ ఆస్తులు,  కాంగ్రెస్ పార్టీ ఆస్తులపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా? ధైర్యం ఉంటే తెరపైకి వచ్చి చర్చ చేద్దాం, అంటు సవాల్ విసిరారు.

 Also ReadMLC Addanki Dayakar: కిషన్ రెడ్డి లాంటి బానిసలతోనే దేశానికి నష్టం.. ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు..

Just In

01

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

Baby Sale Case: దారుణం.. చెల్లిని అమ్మవద్దు అని తల్లి కాళ్ల మీద పడి వేడుకున్న కూతుర్లు.. ఎక్కడంటే?