Riyaz Encounter: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య రాష్ట్రంలో తీవ్ర సంచనం సృష్టించింది. వివిద కేసుల్లో పాతనేరస్తుడిగా ఉన్న రియాజ్ అరెస్టే చేసి పోలీస్ స్టేషన్‌కి తరలిస్తుడగా కాని స్టేబుల్ పై కత్తితో దాడి చేసి పరారైన సంఘటన మనందరికి తెలిసిన విషయమే.. అయితే.. రియాజ్ ని పట్టుకొని నిజామాబాద్ ప్రభుత్వ హస్పిటల్(Nizamabad Government Hospital)కి తరలిస్తున్న సమయంలో అతని పక్కన ఉన్న కానిస్టేబుల్ గన్(Jun) లాక్కోని పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని ఎన్ కౌంటర్(Encounter) చేశారు. అయితే రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం రాష్ట్రంలో ఈ వార్త సంచలనం సృష్టించింది. రియాజ్ ఎన్నౌంటర్ అనంతరం హత్యకు గురైన కానిస్టేబుల్ భార్య ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నాను అని తెలిపింది.
కానిస్టేబుల్ భార్య భావోద్వేగం..
నా భర్త కానిస్టేబుల్‌ని హత్య చేసిన రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినందుకు పోలీస్(Police) శాఖకు ధన్యవాదాలు అని కానిస్టేబుల్ భార్య ప్రణీత(Praneetha) అన్నారు. హంతకుడు రియాజ్ కు తగిన శాస్తి జరిగిందని అన్నారు. నాలాగా ఇంకే కుటుబానికి ఇలా జరగకుండా ఉండాలి ఆమే అన్నారు. నా తమ్ముడు చాలా మంచివాడని, మేమంతా కలిసి ఉండేవారమని కానిస్టేబుల్ సోదరుడు తెలిపాడు. మా తమ్ముడు లేని లోటు మాకు చాలా ఉందని, హంతకుడు రియాజ్ ని ఎన్కౌంటర్ చేసినందుకు ఇటు ప్రభుత్వానికి సిపీ కి ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు.
Also Read: Dude Movie: ఇంకేం కావాలో అర్థం కావడం లేదు.. మిక్స్‌డ్ టాక్‌పై మైత్రీ నిర్మాత షాకింగ్ కామెంట్స్
గతంలో పలు కేసుల్లో నిందితుడిగా..
గతంలో వాహనాల చోరీలు, చెయిన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడైన పాత నేరస్తుడు షేక్ రియాజ్‌ను నిజామాబాద్ సీసీఎస్(CCS)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రమోద్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రియాదజ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, దారిలో అతను అకస్మాత్తుగా కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో పొడిచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ దుర్మరణం చెందాడు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ హత్యపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy), రియాద్‌ను పట్టుకునేందుకు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాలని నిజామాబాద్ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో ఆధారాలను బట్టి గాలింపు చేపట్టి, నిందితుడిని పట్టుకున్నారు. వాలని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ సీపీ 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న రియాద్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డ్‌ను కూడా ప్రకటించారు.
రియాజ్ ను ఎన్కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ ప్రమోద్ భార్య, కుటుంబ సభ్యులు
పోలీసులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ప్రమోద్ సోదరుడు https://t.co/s4m4hV587X pic.twitter.com/2vkg4MLhqX
— BIG TV Breaking News (@bigtvtelugu) October 20, 2025
Also Read: Telangana: రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు పీఏలతో పరేషాన్.. వీఐపీలకు సేవలు సామాన్యులకు చుక్కలు
