Huzurabad (Image Source: X)
తెలంగాణ

Huzurabad: ఫైర్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలిన టపాకాయల దుకాణం.. భయం గుప్పిట్లో హుజురాబాద్

Huzurabad: దీపావళి (Deepavali) పండుగ వేళ, హుజురాబాద్ (Huzurabad) పట్టణంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలిస్తూ కొనసాగుతున్న ఓ టపాకాయల దుకాణం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో గల సబ్ స్టేషన్ పక్కనే, అన్నపూర్ణ రైస్ మిల్లు ఎదురుగా ఉన్న ‘అంజనా టపాకాయల దుకాణం’ (Anjana Tapakaya Shop) వద్ద కనీస అగ్నిమాపక భద్రతా చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రమాదకరంగా టపాకాయల నిల్వ

పండుగ సందర్భంగా భారీ స్థాయిలో టపాకాయలను నిల్వ చేసే ఈ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే, సమీపంలో ఉన్న సబ్ స్టేషన్, రైస్ మిల్లుతో పాటు చుట్టుపక్కల నివాసాలకు పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలను నివారించడానికి తప్పనిసరిగా ఉండాల్సిన ఇసుక బకెట్లు, వాటర్ ట్యాంకులు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు (అగ్నిమాపక యంత్రాలు) వంటి కనీస భద్రతా ఏర్పాట్లు సైతం ఈ దుకాణంలో కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు.

Also Read- Bigg Boss Telugu 9: నువ్వో డ్రామా క్వీన్.. నీ ఏజ్‌కు తగ్గట్టుగా బిహేవ్ చెయ్.. మొత్తానికి ఓపెన్ అయిపోతున్నారు

పట్టించుకోని అధికారులు

సాధారణంగా, టపాకాయల దుకాణాలకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు, అవి నడిపేటప్పుడు ఫైర్ సేఫ్టీ (fire safety) నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు తనిఖీలు నిర్వహించాలి. కానీ, హుజురాబాద్ పట్టణంలో ఈ టపాకాయల దుకాణం విషయంలో సంబంధిత అధికారులు పర్యవేక్షణను పూర్తిగా విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను, ఆస్తులను ప్రమాదంలో పడేసే ఈ పరిస్థితిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Also Read- Anaganaga Oka Raju: పటాకాయల షాప్‌లో పట్టు చీరలు దొరుకుతాయా.. ‘అనగనగా ఒక రాజు’ దీవాళి బ్లాస్ట్!

తక్షణ చర్యలు అవసరం

బోర్నపల్లి హుజురాబాద్ ప్రాంతంలో రద్దీగా ఉండే కరీంనగర్ రోడ్డు పక్కన నెలకొన్న ఈ దుకాణం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైనా సంబంధిత అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి, ‘అంజనా టపాకాయల దుకాణం’లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను తనిఖీ చేసి, లోపాలు ఉంటే తక్షణమే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే దుకాణాన్ని మూసివేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, చిన్న పొరపాటు కూడా పెను విషాదానికి దారి తీసే ప్రమాదం ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

Baby Sale Case: దారుణం.. చెల్లిని అమ్మవద్దు అని తల్లి కాళ్ల మీద పడి వేడుకున్న కూతుర్లు.. ఎక్కడంటే?