Tanuja vs Ramya (Image Source: Youtube)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: నువ్వో డ్రామా క్వీన్.. నీ ఏజ్‌కు తగ్గట్టుగా బిహేవ్ చెయ్.. మొత్తానికి ఓపెన్ అయిపోతున్నారు

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లో 7వ వారం నామినేషన్స్‌కు వచ్చే సరికి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆయేషాకు, హౌస్‌లో మొదటి నుంచి ఉంటున్న రీతూకి మధ్య ఎలాంటి వాగ్వివాదం నడిచిందో మొదటి ప్రోమోలో చూపించారు. తాజాగా రెండో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో దివ్య వచ్చేసి ‘మీ ఓపెనీయనే రైట్ అనే ఒక ఫీలింగ్‌లో ఉంటారనిపిస్తుంది నాకు..’ అని సాయిని నామినేట్ చేసింది. అలాంటి సిచ్యుయేషన్ ఒక్కటి చెప్పండని సాయి, దివ్యతో వాగ్వివాదం చేస్తున్నాడు. ‘నేను చెప్పను, నాకవసరం లేదు’ అని దివ్య అనగానే.. ‘మీరొక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ.. ఏదేదో ఊహించుకుంటూ ఉంటే’ అని సాయి అనగానే.. ఎవరు మెయింటైన్ చేశారని దివ్య (Divya) వాదిస్తుంది. ‘మీరే.. మీ వల్ల ఒక ఫొజిషన్‌లో ఉన్న వ్యక్తి.. ఒక్కసారిగా ఇలా పడిపోయాడు’ అని సాయి అంటే, ‘దివ్య వల్ల ఆయన ఎలిమినేట్ అయ్యారని ఎవరూ చెప్పలేదు’ అంటూ కౌంటర్ ఎటాక్ చేస్తుంది దివ్య. నన్ను నామినేట్ చేస్తూ.. మీరిచ్చే వివరణ అర్థవంతంగా లేదు.. అని సాయి (Sai) బిగ్గరగా అరిచేశాడు.

Also Read- Bigg Boss Telugu 9: నువ్వు, నీ ఓవరాక్షన్, నీ లవ్ యవ్వారాలు నాకు నచ్చలే.. రీతూకి షాకిచ్చిన ఆయేషా!

నన్ను సేవ్ చేయండని ఎప్పుడైనా అడిగానా?

అనంతరం రీతూ వచ్చేసి రాము (Ramu)ని నామినేట్ చేసింది. అందుకు కారణంగా.. ‘రామూ.. నువ్వసలు నాకెక్కడా కనిపించడం లేదు’ అని అనగానే ‘కళ్లు చెకప్ చేయించుకుంటే బెటర్’ అని రాము కౌంటర్ వేశాడు. ‘నాకెవరూ లేరు.. నన్నిలా ఒక్కడ్ని చేసేశారు.. అనడమే నాకు కనిపించింది’ అని రీతూ అంటే.. నేను ఎవరితో చెప్పినా? ప్రూఫ్ చూపించు.. అని రీతూని రాము ప్రశ్నిస్తున్నాడు. ‘ఒకవేళ అదే జరిగితే ఆ బోర్డు‌పైన నాల్గవ స్థానంలో కెప్టెన్ అయ్యుండేవానిని కాను’ అని రాము అంటే, ఏ సపోర్ట్ లేకుండానే నువ్వు కెప్టెన్ అయ్యావా? అంటూ రీతూ (Rithu) ప్రశ్నించింది. నీకే సపోర్ట్ లేదు.. నేను ఎవరిని సపోర్ట్ చేయమని అడగలేదు.. అంటూ హౌస్‌మేట్స్ అందరినీ.. నేను నీ దగ్గరకు వచ్చి సపోర్ట్ కావాలని అడిగానా? నేను నామినేషన్స్‌లో ఉన్నా.. నన్ను సేవ్ చేయండని ఎప్పుడైనా అడిగానా? అని అంటే.. అందరూ లేదని చెప్పారు. నాకు గేమ్ ఆడే సత్తా ఉంది, నేను గేమ్ ఆడతా.. బరాబర్ ఆడతా? అని రీతూకి రాము ఇచ్చిపడేశాడు.

Also Read- Anaganaga Oka Raju: పటాకాయల షాప్‌లో పట్టు చీరలు దొరుకుతాయా.. ‘అనగనగా ఒక రాజు’ దీవాళి బ్లాస్ట్!

ఏజ్‌కు తగ్గట్టుగా బిహేవ్ చేయడం నేర్చుకో..

అనంతరం రమ్య (Ramya) వచ్చి తనూజ (Tanuja)ని నామినేట్ చేసింది. ‘నువ్వొక ముసుగులో ఉన్నావ్.. అక్కడి నుంచి నువ్వు బయటకు రా.. అండ్ ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు.. నటిస్తున్నావు.. నువ్వు ఫేక్’ అని చెబుతున్న టైమ్‌లో తనూజ ఒక్కసారిగా ఫైరయింది. ‘డ్రామా క్వీన్ అనుకుంటావో? సూపర్ క్వీన్ అనుకుంటావో? సీరియల్ క్వీన్ అనుకుంటావో? పోవే.. నా గేమ్ ఇది. నన్ను బాయ్‌కాట్ చేయడానికి నువ్వెవరు? ఫస్ట్ నీ ఏజ్‌కు తగ్గట్టుగా బిహేవ్ చేయడం నేర్చుకో?’ అని తనూజ అనగానే.. ‘అబ్బో.. నీకు ఏజ్ పెరిగింది కానీ, బుర్ర పెరగలేదు’ అని రమ్య అనగానే.. ‘మైండ్ యువర్ వర్డ్స్’ అంటూ తనూజ వార్నింగ్ ఇచ్చింది. ‘మనుషులను పంపించడానికి వచ్చిన దేవతవి?’ అని రమ్య అనగానే.. ‘థ్యాంక్యూ.. ఐయామ్ దేవత.. వచ్చి దర్శనం చేసుకో.. వెళ్లవమ్మా?’ అని తనూజ కౌంటర్ విసిరింది. మొత్తంగా అయితే నామినేషన్స్ రచ్చ మాములుగా లేదనేది.. ఈ ప్రోమో తెలియజేస్తుంది. మరి మిగతా వాళ్ల మధ్య ఇంకెంత వాడి వేడిగా ఈ రచ్చ జరిగిందో తెలియాలంటే.. షో చూడాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!