Bandi Sanjay (imagecredit:swetcha)
తెలంగాణ

Bandi Sanjay: మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి: బండి సంజయ్ హెచ్చరిక

Bandi Sanjay: రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోవాలని స్పష్టం చేశారు. లేదంటే గుట్టు బయటపడుతుందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో, కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్ట్ నిర్మూలనకే పరిమితం కావడం లేదని వివరించారు.

దేశ భద్రతకు ముప్పు

అవినీతి(corruption), నేరం(crime), ఉగ్రవాద సంబంధాల నెట్ వర్క్‌ను సైతం వెలికి తీస్తున్నాయని స్పష్​టం చేశారు. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. కరుణ లేకుండా కఠిన చర్యలు తీసుకోబోతున్నాయంటూ పేర్కొన్నారు. అంతర్గత భద్రత విషయంలో కేంద్రం రాజీ పడబోదని స్పష్టం చేశారు. తప్పు వైపు నిలబడే వారెవరైనా సరే పడిపోక తప్పదని బండి సంజయ్ పేర్కొన్నారు.

Also Read: Garib Rath Catches Fire: పంజాబ్‌లో మంటల్లో చిక్కుకున్న రైలు.. తప్పిన పెనుప్రమాదం

కర్తవ్య భవన్‌లోకి బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం తన శాఖ కార్యాలయాన్ని కర్తవ్య భవన్‌లోకి మార్చారు. సెంట్రల్ విస్టా రీ డెవలెప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మించిన కామన్ సెంట్రల్ సచివాలయాన్ని ప్రధాని మోదీ ఆగస్ట్ 6న ప్రారంభించారు. సుమారు 1.5 లక్ష చదరపు మీటర్ల ప్లింట్ ఏరియా కలిగి ఉన్న ఈ భవనం, రెండు బేస్‌మెంట్లతో పాటు 7 అంతస్తులుగా నిర్మించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు సహాయ మంత్రి నిత్యానందరాయ్ కార్యాలయాలు ఇప్పటికే కర్తవ్య భవన్‌లోని లెవెల్ 5లోకి మారాయి. దీపావళి సందర్భంగా మంచి మహూర్తం ఉండడంతో బండి సంజయ్ పూజారుల వేద మంత్రోచ్ఛరణల నడుమ కర్తవ్య భవన్‌లోకి అడుగుపెట్టారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనకు కేటాయించిన సీటులో ఆసీనులయ్యారు.

Also Read: DCC Appointment: 42 శాతం సవాల్.. డీసీసీ చీఫ్​ సెలక్షన్‌లోనూ అమలు చేస్తుందా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!