Tummala Nageswara Rao: రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!
Thummala Nageswara Rao (imagecredit:twitter)
Telangana News

Tummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. రూ.48.54 కోట్లతో జాతీయ ఆహార భద్రత స్కీమ్

Tummala Nageswara Rao: రైతు నేస్తం కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా పథకంలో మేలైన పప్పు దినుసు విత్తనాల పంపిణీ(Distribution of pulses seeds) చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పిన మాట దిశగా గతవారం జాతీయ నూనె గింజల మిషన్ ప్రారంభమైందన్నారు. ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టిందన్నారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు.

నేచురల్ ఫార్మింగ్‌..

గత సీజన్‌లో జిల్లాకు ఎంపిక చేసిన ఒక మండలంలో 1,39,000 మట్టి నమూనాలు సేకరించి, వాటి విశ్లేషణ పూర్తి చేసి ఫలితాలు అందచేయడానికి ఏర్పాట్లు, ఇంకో 1,70,000 మట్టి నమూనా ఫలితాలు విశ్లేషణ దశలో ఉన్నాయని వివరించారు. నేచురల్ ఫార్మింగ్‌(Natural Farming)కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, దీని కింద క్లస్టర్ల గుర్తింపు, శిక్షణ పూర్తి చేశామన్నారు. ఒకవైపు వానాకాల పంటల కొనుగోళ్ల ప్రక్రియ మరోవైపు యాసంగి పథకాల అమలుపై పూర్తిస్థాయి సమీక్షలు చేశామని తెలిపారు.

Also Read: Gadwal District: ఇరుకుగా మారుతున్న రహదారులు.. పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

పదేళ్లలో దాదాపు..

కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర వాటాలతో అమలు అయ్యే పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ, గరిష్ట స్థాయిలో రైతుల ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టాయన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగం పదేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర నష్టపోయిందని మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Khata Ramachandra Reddy: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డికి కన్నీటి వీడ్కోలు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..