Swetcha Effect (imagecredit:twitter)
తెలంగాణ

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలపై సర్కార్ సీరియస్!

Swetcha Effect: ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. కంటిన్యూగా ఫిర్యాదులు వస్తుండటంతో ఇటీవల 23 నర్సింగ్ స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇందులో 14 నర్సింగ్ స్కూల్స్, కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వాటిలో ఏడు నర్సింగ్ కాలేజీలు(Nursing colleges) ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న అడ్రస్ కాకుండా మరో చోట నిర్వహిస్తున్నారు. దీంతో పాటు మౌలిక సదుపాయాలు, స్టాఫ్​ కూడా సరిగ్గా లేని మరో ఏడు కాలేజీలకూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కేవలం వారం రోజులు లోపు వివరణ ఇవ్వాలని వైద్యశాఖ కోరింది. నిబంధనలు ప్రకారం లేని నర్సింగ్ కాలేజీలను రద్దు చేయాలని తనిఖీల టీమ్స్ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చాయి. హైదరాబాద్(Hyderabad), రంగారెడ్డి(Rangareddy), మేడ్చల్(Medchel), నల్లగొండ(Nalgonda) జిల్లాలోని పలు నర్సింగ్ స్కూల్స్, కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు.

Also Read: Gadwal District: ఇరుకుగా మారుతున్న రహదారులు.. పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

తనిఖీలు చేసిన కాలేజీలు ఇవే… 

=ఏడీఆర్ ఎమ్ నర్సింగ్ స్కూల్ రామంతపూర్
=శ్రీ వెంకటేశ్వర మల్కాజ్ గిరి
=పాలోమి నర్సింగ్ స్కూల్ ఏఎస్ రావు నగర్
=హీలింగ్ టచ్ నర్సింగ్ స్కూల్ సికింద్రాబాద్
=గ్లోబల్ మలక్ పేట్
=మైత్రీ చందానగర్
=జేఎస్ ఎమ్
=జయ స్కూల్ ఆఫ్​ నర్సింగ్ నాంపల్లి
=మదర్ కృష్ణబాయి ముషీరాబాద్
=ఆదిత్య తిలక్ రోడ్
=జీవని శ్రీపురం కాలనీ
=శాంతి హిమాయత్ నగర్
=వీ స్కూల్ దిల్ సుఖ్ నగర్
=కరుణ మోయినాబాద్
=శ్రేష్ణ హయత్ నగర్
=మెగాసిటీ తాడ్ బండ్
=సుజాత బీఎన్ రెడ్డి నగర్
=నైటింగెల్ దేవరకొండ
=బాపూజీ నల్లగొండ
=శ్రీ భావన
=త్రీవేణి,
=ఆపర్ణ
=మధర్ థెరిసా స్కూల్ ఆఫ్​ నర్సింగ్

Also Read: Govt Employees: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత!.. మరి ప్రైవేటు ఉద్యోగుల సంగతేంటి?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!