Bigg Boss Telugu 9: సండే వచ్చేసింది. బిగ్ బాస్ వీక్షకులకు శని, ఆదివారాలు ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు రోజులు కింగ్ నాగార్జున ఈ షోని నడిపిస్తుంటారు. ఇంటి సభ్యులు కూడా వారం అంతా టాస్క్‌లతో అలసిపోయి, ఇంటి సభ్యులతో గొడవలు పడి విసిగిపోయి ఉంటారు. కానీ, ఆ కష్టం అంతా వీకెండ్ వచ్చేసరికి మరిచిపోయేలా, చేసిన తప్పులు గుర్తు చేసి ఆటను మార్చుకునేలా, మళ్లీ అంతా ఒకటే అనేలా.. హోస్ట్ నాగార్జున (Bigg Boss Host King Nagarjuna) అందరినీ సెట్ చేస్తారు. ఆల్రెడీ శనివారం క్లాసులు పూర్తవ్వగా.. ఆదివారం మరింత ఇంట్రస్ట్‌గా ఉండేలా కింగ్ నాగార్జున ఈ షోని ప్లాన్ చేశారు. ఈ ఆదివారం షోలో గెస్ట్‌లతో మరింత సందడి నెలకొనేలా, ముఖ్యంగా దీపావళి (Diwali) సందడి ఒక రోజు ముందే తెచ్చేశారు. తాజాగా సండే ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో 2 విడుదలైంది.
Also Read- OG Movie: ‘హంగ్రీ చీతా’ వీడియో సాంగ్‌తో యూట్యూబ్ షేక్.. పవన్ స్టామినా ఇది!
‘జటాధర’ టీమ్ సందడి
ప్రోమో 1లో కొన్ని ఆటలు, పాటల అనంతరం విన్నర్స్‌కు వారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వీడియో మెసేజ్‌ని అందించి అందరూ ఎమోషనల్ అవుతున్నట్లుగా చూపించారు. ఇక ప్రోమో 2 విషయానికి వస్తే.. నాగ్ ఎంట్రీ అనంతరం.. ‘జటాధర’ (Jatadhara) టీమ్ ఈ షోలో సందడి చేసింది. బాలీవుడ్ బ్యూటీస్ సోనాక్షి సిన్హా, శిల్ప శిరోద్కర్‌తో పాటు హీరో సుధీర్ బాబు కూడా ఈ షోకు వచ్చారు. శిల్పాను చూపిస్తూ.. ఈమె నా సినిమాలో హీరోయిన్‌గా చేశారు. ‘ఖుదాగవా’ అనే సినిమాలో ఇద్దరం కలిసి చేశామని కింగ్ అన్నారు. సుధీర్ తన సినిమా కాన్సెప్ట్ అయిన త్రిశూలంతో రావడంతో.. ఎందుకు అలా వచ్చావ్? అని నాగ్ ప్రశ్నించారు. కొన్ని దెయ్యాలకు మనం ఎంత బాడీ చేసినా సరిపోదు. ఎక్స్‌ట్రా పవర్ కావాలి. ఈ త్రిశూలం అదే అని చెప్పగానే.. సోనాక్షి ‘జటాధర’లోని తన ఐకానిక్ మూమెంట్‌ని చేసి చూపించింది. వారితో హౌస్ సభ్యులతో మాట్లాడించారు. అనంతరం హౌస్ మెంబర్స్ డ్యాన్స్ చేసి, గెస్ట్‌లను ఖుషి చేశారు.
Also Read- Bigg Boss Telugu 9: పెళ్లి నీకు, నాకా? నాగ్ చేసిన పనికి ఏడ్చేసిన సంజన!
ఫైర్ క్రాకర్స్ ఆఫ్ ఫన్
‘జటాధర’ టీమ్ తర్వాత సింగర్ సాకేత్ (Saketh Komanduri)తో బిగ్ బాస్ హౌస్‌లోని మెంబర్స్ చేస్తున్న పనులపై సాంగ్స్ పాడించారు. తనూజ, ఇమ్ములపై సాకేత్ పాడిన పాటను మెచ్చుకుంటూ.. కరెక్ట్‌గా పాడావని కింగ్ అన్నారు. ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) హీరోయిన్ శివాని నాగారం, అప్సరా రాణి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో స్టేజ్‌ని హీటెక్కించారు. వెంటనే హైపర్ ఆది (Hyper Aadi) అరంగేట్రం. ‘వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ముందు ఈ సీజన్ తగ్గేదేలే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అస్సలు తగ్గేదేలే’ అని పుష్ప ఐకానిక్ సిగ్నేచర్ చేసి చూపించారు. ‘నాన్నా అని పిలవాలని కూతురు, అన్నయ్యా అని పిలవాలని చెల్లి, మామయ్యా అని పిలవాలని అల్లుడు.. ఇంకా అల్లాడిపోతున్నార్రా బాబోయ్. రేపు సంక్రాంతికి రాబోయే ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి కదా.. వాళ్లు కూడా ఆలోచనలో పడ్డారు. ఇంతకంటే ఫ్యామిలీ డ్రామా మేము తీయగలమా అని? ఏ రోజు అయితే ఇమ్ముగాడు నిన్ను అమ్మా అని పిలిచాడో.. ఆ రోజు నుంచి వాడికి బొమ్మ కనబడుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ అమ్మ అది, అమ్మ ఇది అంటూ ఉంటే.. బయట వాళ్ల అమ్మ కన్ఫూజ్ అవుతుంది. వాడికి అమ్మ నేనా? లేక సంజననా? అని. ప్రతి ఫ్యామిలీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఎంటరైన తర్వాత కలహాలు, చిచ్చులు రేగుతుంటాయి కదా.. ‘సంక్రాంతి’ సినిమాలో సంగీత, ‘శివరామరాజు’ సినిమాలో లయ, సీజన్ 9లో దివ్య’ అంటూ హైపర్ ఆది కాసేపు నవ్వులు పూయించారు. అనంతరం ఆనంది (Anandi) ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఈ ప్రోమోను ముగించారు. దీనికి ‘ఫైర్ క్రాకర్స్ ఆఫ్ ఫన్’ అంటూ టైటిల్ పెట్టారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
