Bigg Boss Telugu 9 (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: పెళ్లి నీకు, నాకా? నాగ్ చేసిన పనికి ఏడ్చేసిన సంజన!

Bigg Boss Telugu 9: ఆదివారం (Bigg Boss Sunday) వచ్చేసింది. బిగ్ బాస్ వీక్షకులకు శని, ఆదివారాలు ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీక్ అంతా ఒక ఎత్తు అయితే, వీకెండ్ మరో ఎత్తు అనేలా కింగ్ నాగార్జున ఈ షోని నడిపిస్తుంటారు. ఇంటి సభ్యులు కూడా వారం అంతా టాస్క్‌లతో అలసిపోయి, ఇంటి సభ్యులతో గొడవలు పెంచుకుని విసిగిపోయి ఉంటారు. కానీ, ఆ కష్టం అంతా వీకెండ్ వచ్చేసరికి మరిచిపోయి, మళ్లీ అంతా ఒకటే అనేలా కలిసిపోతారు. అలా నాగార్జున అందరినీ సెట్ చేస్తారు. అలాంటి రోజు రానే వచ్చేసింది. ఆల్రెడీ శనివారం ఇచ్చిన క్లాసు‌ల అనంతరం.. ఆదివారం మరింత ఇంట్రస్ట్‌గా ఉండేలా కింగ్ నాగార్జున ఈ షో‌ని నడిపిస్తుంటారు. ఈ ఆదివారం షో‌లో ఏం జరిగిందో.. తాజాగా ఓ ప్రోమోని వదిలారు.

Also Read- Bandla Ganesh: బండ్ల గణేష్ దీవాళి పార్టీ.. టాలీవుడ్ అంతా ఆయన ఇంట్లోనే.. ఏదో ప్లాన్ చేశాడయ్యో!

ఫైర్ క్రాకర్ యాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్లాస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) షో‌లో 42వ రోజు ఆదివారం సందడితో పాటు, దీవాళి సందడి కనిపించింది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ షో‌ని ప్రారంభించిన హోస్ట్ కింగ్ నాగార్జున.. హౌస్ సభ్యుల్లో హుషారు నింపారు. ‘దీపావళి మీ ఇంట్లో.. ఎంటర్‌టైన్‌మెంట్ బ్లాస్ట్ మా ఇంట్లో’ అంటూ కంటెస్టెంట్స్‌తో కొన్ని ఆటలు ఆడించినట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. ‘ఫైర్ క్రాకర్ యాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్లాస్ట్’ అంటూ దీపావళికి రకరకాల టపాసులు ఉంటాయి. యూ ఆర్ ఆల్ మై క్రాకర్ అంటూ కింగ్ నాగార్జున (King Nagarjuna) దీవాళి స్పెషల్ ఎపిసోడ్‌కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి అందరినీ రెడీ చేశారు. పెళ్లి చూపులకు వెళుతున్నట్లుగా కనిపిస్తున్నారు సార్ అని సంజన అనగానే.. ‘పెళ్లి నీకు నాకా?’ అంటూ నాగ్ పంచ్ పేల్చారు. ఇది అసలైన దీవాళి ఫ్యామిలీ ఫెస్టివల్ అని చెబుతూ.. ఆటలో గెలిస్తే.. ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజ్ వస్తుందని.. ఇంటి సభ్యులకు దీవాళి ట్రీట్ ప్లాన్ చేశారు నాగ్.

Also Read- Rashmika Mandanna: విజయ్‌తో ఎంగేజ్‌మెంట్‌పై నేషనల్ క్రష్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

కొత్త బట్టలు, స్వీట్స్

మూడు పదాలు చెబితే.. సినిమా పేరు గెస్ చేయాలనేది ఆట. ఈ ఆటలో పవన్, సుమన్ శెట్టి, సంజన వంటి వారు గెలిచినట్లుగా చూపించారు. వారి ఫ్యామిలీ మెంబర్స్‌ వీడియో మెసేజ్ చూపించి ఎమోషనల్ అయ్యేలా చేశారు. కొన్ని ఆటలు, పాటల అనంతరం, ఈ పండుగ రోజున నా ఇంటి సభ్యులతో పండుగ జరుపుకుందామని.. ఇంటి సభ్యులందరికీ గిఫ్ట్‌లు తెచ్చాను అంటూ ఇంటిలోని వారందరికీ కొత్త బట్టలు, స్వీట్స్ పంపించారు నాగార్జున. వాటిని చూసి ఇంటి సభ్యులు ఖుషి అయ్యారు. ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ అంటూ ఇంటి సభ్యులతో స్వీట్స్ కోసం గేమ్ ఆడించారు. అనంతరం వన్ లక్కీ విన్నర్ అంటూ.. గెలిచిన వారి ఫ్యామిలీ మెంబర్స్ వీడియో మెసేజ్ చూపించి.. ఎమోషనల్ అయ్యేలా చేశారు. ఈ ప్రోమో ఇలా ముగిసింది. మొత్తంగా అయితే, సండే ఇంటి సభ్యులను సంతోషపరచడమే కాకుండా, ఎమోషనల్ అయ్యేలా కూడా చేసి.. షోపై ఆసక్తిని కలిగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది