Moviest-Letter (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Maoist letters: మావోయిస్టుల మరో లేఖ.. సోను, సతీష్‌లకు బుద్ది చెప్పాలంటూ పిలుపు

Maoist lettesr: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మరో లేఖ విడుదల

మహబూబాబాద్, స్వేచ్ఛ: మావోయిస్టు పార్టీలో లేఖలు (Maoist letters) కలకలం సృష్టిస్తున్నాయి. వరుసగా వెలువడుతున్న లేఖల పట్ల ఇరు విభేద వర్గాల నేతలు కలవరం చెందుతున్నారు. తాజాగా, అక్టోబర్ 16న మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన మరో లేఖ ఆదివారం (అక్టోబర్ 19) వెలుగులోకి వచ్చింది. విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువుకు లొంగిపోయిన సోను, సతీష్‌లకు, వారి అనుచరులకు కూడా తగిన శిక్ష విధించాలంటూ విప్లవ ప్రజలకు పిలుపునివ్వడం ఈ లేఖ సారాంశంగా ఉంది. సోను, సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. సోను ఆధ్వర్యంలో వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు 60 మంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారని, పార్టీకి చెందిన 50 ఆయుధాలను శత్రువులకు అప్పగించారని లేఖలో అభయ్ పేర్కొన్నారు.

Read Also- Indian Boycott: టర్కీ, అజర్‌బైజాన్‌లకు బుద్ధి చెబుతున్న భారతీయులు.. ఏం చేస్తున్నారో తెలుసా?

2011 నుంచి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ దండకారణ్య విప్లవోద్యమాన్ని దేశవ్యాప్త విప్లవోద్యమంగా 2018 నాటికి మెరుగుపరిచామని లేఖలో అభయ్ పేర్కొన్నారు. 2018లో పార్టీ తాత్కాలికంగా వెనుకంజకు గురైందని వెల్లడించారు. 2020 డిసెంబర్‌లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో సోను దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై శ్రీ ఆత్మక విశ్లేషణతో కూడిన నిర్ధారణలు చేస్తూ ఒక పత్రాన్ని ప్రవేశపెట్టారని ప్రస్తావించారు. సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించిందన్నారు. అప్పటినుంచి ఆయన చేస్తున్న తప్పులను సరిదిద్దుతూ కేంద్ర కమిటీ, పోలీస్ బ్యూరో కమిటీలు సహనంతో వ్యవహరిస్తున్నాయని చెప్పారు.

2024లో మొదలైన విప్లవ ప్రతిఘాతుక ఆపరేషన్‌లో విప్లవకారులందరూ ప్రతిరోజు దాడులను ఎదుర్కొంటూ వస్తున్నామన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ యుద్ధాన్ని ప్రాణాంతక చర్యగా పరిగణించి ప్రతిఘటిస్తున్నామని అభయ్ చెప్పారు. సోను తనలో ఉన్న అహంభావాన్ని సరిదిద్దుకొని, ఫలితంగా తన బలహీనతలను, ప్రాణభీతిని ముసుగు కప్పి పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక 100 ఫలితంగా భారత విప్లవోద్యమం ఓటమిపాలయ్యే స్థితికి దారితీసిందని పేర్కొన్నారు.

Read Also- Govt Employees: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత!.. మరి ప్రైవేటు ఉద్యోగుల సంగతేంటి?

ఇలాంటి పరిస్థితుల్లో శత్రువర్గాలకు ఆయుధాలను అప్పగించడం మావోయిస్టు పార్టీ నిబంధనలకు విరుద్ధమని అభయ్ పేర్కొన్నారు. నిజమైన విప్లవోద్యమకారులు తాత్కాలిక ఆయుధ విరమణకు సాహసించరని వ్యాఖ్యానించారు. నిజంగా సోనుకు తను రాసిన లేఖపై విశ్వాసం ఉంటే పార్టీలో ఉంటూ, కేంద్ర కమిటీలో, పోలీస్ బ్యూరోలో చర్చించడానికి సిద్ధపడాలే కానీ శత్రువులకు అలుసు ఇచ్చినట్లుగా, ఆపద సమయంలో అనుకోకుండా లొంగిపోవడం సరికాదన్నారు. తన తప్పుడు వాదనలను కేంద్ర కమిటీలో పోలిటి బ్యూరోలో చర్చించకుండా కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతిని ఉల్లంఘించారని, నిర్మాణ క్రమశిక్షణను ఉల్లంఘించి గత కొద్ది నెలలుగా వివిధ స్థాయిల పార్టీ కమిటీ సభ్యులతో, పార్టీ సభ్యులతో, పీఎల్‌జీఏ సభ్యులతో చర్చించే పార్టీని చీల్చివేసే కుట్రకు పూనుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విప్లవ తత్వాన్ని కోల్పోయి విప్లవ ద్రోహిగా, పార్టీ విచ్చన్నకుడిగా, విప్లవ ప్రతిఘటకుడిగా మారిన సోనును, ఆయనతో కలిసి శత్రువుకు లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు వివేక్, డీకే ఎస్ జెడ్ సి ప్రత్యామ్నాయ సభ్యురాలు దీపను, పదిమంది డివిజనల్ కమిటీ, కంపెనీ పార్టీ సభ్యులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. విప్లవద్రోహం చేసిన ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిచ్చారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!