Deepika-Padukone( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Deepika Padukone: మాతృత్వంపై ఎమోషనల్ అవుతున్న దీపికా పదుకొణె.. అందుకేనా మార్పు..

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోణె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌ను మార్చుకుని, తన మదర్‌హుడ్ జర్నీని సరదాగా ఎంజాయ్ చేస్తూ తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ హీరోయిన్ తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి సెప్టెంబర్ 8, 2024న కూతురు దుఆ కు జన్మనిచ్చింది. తర్వాత, తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తోంది. ఇప్పుడు ఆమె కొత్త ప్రొఫైల్ ఫోటోలో ‘ఇన్ మై మామ్ ఎరా’ (In my mom era) అని రాసిన టీ-షర్ట్ కనిపిస్తోంది. ఈ మార్పు ఆమె మదర్‌హుడ్‌లోని సంతోషాన్ని, ప్రేమను పూర్తిగా ప్రతిబింబిస్తోంది.

Read also-Akhanda 2: ఆ సినిమాల సక్సెస్‌తో ‘అఖండ 2’పై క్రేజ్ తగ్గుతుందా?

దీపిక ప్రొఫైల్ పిక్ మార్పు

మదర్‌హుడ్ జర్నీకి సరదా దీపికా పదుకోణె తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో మొదట్లో ‘ఫీడ్. బర్ప్. స్లీప్. రిపీట్.’ (Feed. Burp. Sleep. Repeat.) అని రాసుకుని, కొత్త తల్లిగా తన రోజువారీ జీవితాన్ని సరదాగా చాటుకుంది. ఇప్పుడు ఆమె ప్రొఫైల్ పిక్‌లో కనిపించే ఆ టీ-షర్ట్ ఫోటో, మదర్‌హుడ్‌లోని సంతోషాన్ని సూచిస్తూ, ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీపిక తన కూతురు దుఆతో గడిపే రోజుల్లోని చిన్న చిన్న సంతోషాలు, ప్రేమకరమైన క్షణాలు ఈ ఫోటోలో పూర్తిగా కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ ఈ మార్పుకు హృదయపూర్వకంగా స్పందిస్తూ, ‘మదర్‌హుడ్ సూట్ చేస్తుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు, ఆమె జీవితంలోని కొత్త అధ్యాయానికి ఒక సంకేతం. దుఆ పుట్టిన తర్వాత, దీపిక మరింత సామాజికంగా మారిందని, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడ్డానని ఆమె తెలిపింది.

Read also-Tollywood Heroines: టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ హవా.. నిలబడాలంటే అదే ముఖ్యం!

ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక తన మదర్‌హుడ్ అనుభవాలను పంచుకుంది. “నేను ఎప్పటి నుంచో ఓపికగల వ్యక్తిని. నా టాలరెన్స్ లెవల్స్, పేషెన్స్ లెవల్స్ చాలా హై అవుతాయి. కానీ మదర్‌హుడ్ మరింత ఓపికను నేర్పుతుంది. ఇది నన్ను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకెళ్తుంది. చాలా మార్గాల్లో నన్ను మార్చింది. నేను ఎప్పుడూ సామాజిక వ్యక్తి కాదు. కానీ ఇప్పుడు ఇతర పేరెంట్స్‌తో ఇంటరాక్ట్ చేయాలి, ప్లేస్కూల్ గురించి ఆలోచించాలి… ఈ పదాలు ఇప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. కానీ మదర్‌హుడ్ నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకెళ్తుంది, మంచి విధంగా. నాకు కనీసం, ఇది మంచి మార్పు మాత్రమే” అని ఆమె చెప్పింది. మదర్‌హుడ్‌తో పాటు, దీపిక పని వైపు కూడా ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో నటిస్తోంది. రీసెంట్‌గా రోహిత్ షెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ‘సింగాం అగెయిన్’లో ఆమె కనిపించింది. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ వంటి స్టార్స్ పాల్గొన్నారు. ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన పొందింది. తదుపరి, షా రుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ చిత్రంలో దీపిక ప్రధాన పాత్ర పోషిస్తోంది.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!