Akhanda 2: మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన ‘అఖండ’ (Akhanda) సినిమాకు సీక్వెల్‌గా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam) పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం టీజర్‌తో బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. డివోషనల్-యాక్షన్ డ్రామాగా ఈ సినిమా వస్తుండటంతో.. బాలయ్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ బిజినెస్‌తో ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే, ఈ భారీ అంచనాల మధ్య ‘అఖండ 2’ ముందు ఒక బలమైన సవాల్ ఎదురైంది. ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక, మైథలాజికల్ నేపథ్యంతో వచ్చిన కొన్ని చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధించడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ‘మహావతార్ నరసింహ’ వంటి చిత్రం అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే.. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన ‘కాంతార’, దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేశాయి.
Also Read- Bandla Ganesh: బండ్ల గణేష్ దీవాళి పార్టీ.. టాలీవుడ్ అంతా ఆయన ఇంట్లోనే.. ఏదో ప్లాన్ చేశాడయ్యో!
మరీ అంత గొప్పగా లేదు
‘కాంతార’లో రిషబ్ శెట్టి దైవ నర్తకుడిగా కనిపిస్తే, ‘అఖండ’లో బాలకృష్ణ అఘోరాగా శివతత్వాన్ని, దైవశక్తిని చూపించారు. ఈ చిత్రాలు కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, భక్తిభావనను, విజువల్స్ ఫీస్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. ఇప్పుడు ‘అఖండ 2’ కూడా అదే డివోషనల్ జానర్‌లో వస్తుండటంతో.. ఆ చిత్రాలు ఇచ్చిన అనుభూతి కంటే మరింత గొప్పగా ఉంటేనే ప్రేక్షకులు మెచ్చుకుంటారు. లేదంటే, మొన్న వచ్చిన సినిమాలతో పోల్చి చూసి ‘మరీ అంత గొప్పగా లేదు’ అంటూ పక్కన పెట్టేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read- Tollywood Heroines: టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ హవా.. నిలబడాలంటే అదే ముఖ్యం!
వాయిదా ప్రభావం
వాస్తవానికి ‘అఖండ 2: తాండవం’ ముందుగా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. సినిమా వాయిదా పడితే, ఆ చిత్రంపై ఉన్న హైప్, ఇంట్రెస్ట్ తగ్గుతుందనేది టాలీవుడ్‌లో ఉన్న బలమైన సెంటిమెంట్. ఇప్పటికే ఇతర డివోషనల్ చిత్రాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచిన నేపథ్యంలో, ‘అఖండ 2’ మళ్లీ వాయిదా పడితే, ప్రేక్షకుల ఆసక్తి మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దర్శకుడు బోయపాటి, థమన్ కాంబినేషన్ ఈసారి మరింత శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని, యాక్షన్‌ను అందించడానికి సిద్ధమవుతున్నా.. ఆలస్యం మాత్రం నెగెటివ్ ఇంపాక్ట్ చూపవచ్చు. అందుకే, ‘అఖండ 2’ టీమ్ సీజీ వర్క్స్‌ను పూర్తి చేయడంలో రాజీ పడకుండా, అద్భుతమైన విజువల్స్‌తో, పకడ్బందీ కథనంతో ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే, అఖండ సక్సెస్‌తో వచ్చిన క్రేజ్.. ఇతర సినిమాల విజయాల ముందు మసకబారే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహా’తో పోల్చి.. సినిమాపై విమర్శలు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా జోరు పెంచాల్సిన టైమ్ ఇదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
