BC-Bandh (Image source Whatsapp)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BC Bandh: ప్రశాంతంగా ముగిసిన బీసీ బంద్.. రోడ్డెక్కిన బస్సులు

BC Bandh: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేననే డిమాండ్‌తో శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బీసీ బంద్ (BC Bandh) ప్రశాంతంగా ముగిసింది. బీసీ జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్‌లో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బంద్ ముగియడంతో, సాయంత్రం 5 గంటల తర్వాత వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు కూడా తిరిగి రోడ్కెక్కాయి. 5 గంటల సమయంలో బస్సులు డిపోల నుంచి బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్ల నుంచి జిల్లా కేంద్రాలకు బస్సులు బయలుదేరాయి. అదేవిధంగా జిల్లాల కేంద్రాల నుంచి బస్ సర్వీసులు తిరిగి షురూ అయ్యాయి. ఒకటి రెండు చోట్ల చెదురుమదురు ఉద్రిక్తత పరిస్థితులు మినహా బీసీ బంద్ మొత్తం ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల చిన్నపాటి ఘర్షణలు, ఒకచోట పెట్రోల్ బంక్‌పై దాడి మాత్రమే నమోదయ్యాయి. మిగతా అన్ని చోట్లా బంద్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Read Also- Pak-Afghan Conflict: పాక్ -ఆఫ్ఘనిస్థాన్ మధ్య సమస్యను పరిష్కరించడం చాలా ఈజీ.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ బంద్.. కేవలం ఆరంభం మాత్రమే

బీజేపీ సలహాలను కాంగ్రెస్ పట్టించుకోలేదు
కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు బీసీలను సీఎం చేసే దమ్ముందా: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ కేవలం ఆరంభం మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జేఏసీ బంద్ సంపూర్ణంగా విజయవంతమైందన్నారు. బీసీ బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొన్నట్లు వివరించారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మొదట మద్దతిచ్చింది బీజేపీయేనని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ అన్ని అంశాలను రాజకీయం చేస్తోందని విమర్శలు చేశారు. బీజేపీ ఇచ్చిన సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏనాడైనా న్యాయం చేసిందా అని ప్రశ్నించారు. బీసీలకు ఇస్తామని ఇచ్చిన హామీల అమలుకు ఏం అడ్డు వచ్చిందని పాయల్ శంకర్ ప్రశ్నించారు. బీసీల ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై కుట్రలు చేస్తోందని పాయల్ శంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీల గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఏ రోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ బీజేపీ అని అయన తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బీసీలను ముఖ్యమంత్రిని చేసే దమ్ముందా? అని పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తొలుత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ లో ఆయన పాల్గొన్నారు. అంబర్ పేట నియోజకవర్గం బర్కత్ పుర డివిజన్‌లో నిర్వహించిన బంద్‌లో బీసీ సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య, బీజేపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే నిరసనలో పాల్గొన్నారు. పాయల్ శంకర్ స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బర్కత్‌పుర ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.

Read Also- Delhi Fire Accident: ఎంపీల అపార్ట్‌మెంట్‌ల్లో మంటలు.. ఢిల్లీలో ఘోరఅగ్నిప్రమాదం

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?