Aadi Sai Kumar: వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ (Shambhala Movie) మూవీ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ను దీవాళి స్పెషల్‌గా మేకర్స్ వదిలారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. పోస్టర్లు మొదలుకుని గ్లింప్స్, మేకింగ్ వీడియో, టీజర్ ఇలా ప్రతీది మంచి స్పందనను రాబట్టుకుని, ప్రేక్షకులు సినిమా కోసం వెయిట్ చేసేలా చేశాయి. అలాగే ‘శంబాల’పై ట్రేడ్ సర్కిళ్లలో భారీ డిమాండ్ ఏర్పడిందంటే.. ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌తో సినిమా రిలీజ్ డేట్ (Shambhala Release Date)ని ప్రకటించారు.
విడుదల తేదీ ఎప్పుడంటే..
ఈ పోస్టర్ ప్రకారం ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్ సెలవుల్లో బాక్సాఫీస్ రేసులో ప్రధాన పోటీదారులలో ఒకటిగా ‘శంబాల’ నిలవబోతుంది. ఇక రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కనిపించిన తీరుగానీ, పోస్టర్‌లో కనిపించిన కుక్క, హీరో వెనకాల పొగతో ఏర్పడిన ఓ ఆకారం… ఇవన్నీ చూస్తుంటే మూవీపై మరింతగా క్యూరియాసిటీ పెరుగుతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై యుగంధర్ ముని (Ugandhar Muni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై.. మొదటి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి మంచి హైప్ ఏర్పడిన విషయం తెలియంది కాదు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. అలాగే టాలెంటెడ్ టెక్నీషీయన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రవీణ్ కె బంగారి సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమా హైలెట్ కాబోతున్నాయనే విషయం ఇటీవల వచ్చిన టీజర్‌తోనే క్లారిటీ వచ్చేసింది.
Also Read- US Obesity Study: అధిక బరువుతో అమెరికా బేజారు.. ఉబకాయంలో ఆల్‌టైమ్ రికార్డ్.. ఇలా అయితే కష్టమే!
విజువల్ వండర్‌గా
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్ర కథాంశం, కంటెంట్ పాన్-ఇండియన్ స్థాయికి తగ్గట్టుగా ఉంటాయి. అందుకే క్రిస్మస్ సీజన్‌లో డిసెంబర్ 25న మూవీని విడుదల చేయబోతున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాం. ఎంతో క్వాలిటీగా ఈ సినిమా వచ్చింది. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ మూవీ పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే భారీగా ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని తెలిపారు.
Proud to announce that my upcoming film #Shambhala will release on December 25th, this Christmas.
A gripping mix of horror and mystery awaits — stay tuned for a spine-chilling experience! This is gonna be BIG 💥#Shambhala: A Mystical World Releasing This #Christmas On Dec 25th… pic.twitter.com/Iwlg7lil7a— Aadi Saikumar (@iamaadisaikumar) October 18, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
