N.Kiran kumar reddy
Politics

Hyderabad:తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి?

Kiran kumar reddy to be appointed as Telangana new governer :

రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ఎలా మార్చేస్తాయో తెలియదు. అలాగే ఎవరిని ఏ పదవి వరిస్తుందో తెలియదు. ప్రస్తుతానికి తెలంగాణకు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కు గవర్నర్ గా రానున్నారనే వార్త సంచలనంగా మారింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీకి సంబంధించిన పలు కీలక సమావేశాలకు సైతం ఆయన హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా, ఆయనకు బీజేపీ అగ్రనేతలతో ఉన్న పరిచయాల మేరకు బీజేపీ హై కమాండ్
తెలంగాణ గవర్నర్ గా కీలక పదవి కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా నడుస్తోంది.

రాష్ట్రంపై పూర్తి అవగాహన

తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనను గవర్నర్‌గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఇన్‌ఛార్జి మాత్రమే కావడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారానే ప్రచారం ఊపందుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తే పొలిటికల్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి.. బీజేపీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. పైగా మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీ తరపున సీఎం అయిన కిరణ్ కుమార్ కాంగ్రెస్ కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారా లేక బీజేపీకి ఇన్ ఫార్మర్ గా పనిచేస్తారా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు