Gadwal MLA: గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? ఇక గులాబీ పార్టీలో కొనసాగలేననే నిర్ణయానికి ఆయన వచ్చేశారా? అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. ఇప్పటికే ఆయన కార్యకర్తలు, నేతలు, మద్దతుదారులు, సానుభూతిపరులతో తన మనసులోని మాటను చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే.. అటు కాంగ్రెస్ పెద్దలతోనూ ఆయన పార్టీ మార్పు అంశాన్ని చర్చించినట్లు సమాచారం. నిజానికి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు ముందే కృష్ణమోహన్‌రెడ్డిని పార్టీ మారాలని కార్యకర్తలు, నేతలు ఒత్తిడి చేసినా, ఆయన ఇప్పటివరకు బీఆర్ఎస్‌లోనే కొనసాగారు.
