Forest Staff Sports: అటవీ శాఖ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
Forest Staff Sports (imagecredit:swetcha)
Telangana News

Forest Staff Sports: అటవీ శాఖ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

Forest Staff Sports: క్రీడల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని చాటాలని అటవీ శాఖ వన్యప్రాణి ప్రధాన సంరక్షిణాధికారి(వైల్డ్ లైఫ్ చీఫ్) ఈలు సింగ్ మేరు(Eelu Singh Meru) సూచించారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తెలంగాణ అటవీ శాఖ(Telangana Forest Department) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అటవీ సిబ్బంది క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రముఖ భారతీయ షూటర్ ఇషాసింగ్(Isha Singh)తో కలిసి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అన్ని జోన్లకు సంబంధించిన ఆటగాళ్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.

తెలంగాణకు గౌరవం తెచ్చిన..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి కఠినమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారన్నారు. శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటుగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇషా సింగ్ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గౌరవం తెచ్చిన యువ క్రీడాకారిగా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. షూటర్ ఇషాసింగ్ మాట్లాడుతూ తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. దీంతో అడవుల పెరుగుదలతో పాటుగా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు.

Also Read: No 1 Place: టాలీవుడ్‌లో ఇక నెంబర్ వన్ హీరో, హీరోయిన్ ఉండరా? ఇప్పుడిదే ట్రెండ్!

ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లు

పచ్చదనం పెంపొందించేందుకు అటవీ అధికారులు(Forest officers) చర్యలు అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 7 జోన్లకు చెందిన సుమారు 750 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లు నవంబర్(November) రెండో వారంలో డెహ్రాడూన్ లో జరిగే జాతీయ క్రీడల పోటీల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్(CCF) లు శర్వణన్, రామలింగం, ప్రియాంక వర్గీస్, ప్రభాకర్, భీమానాయక్, అకాడమీ డైరెక్టర్ ఎస్జే ఆశ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: Lord Brahma: తల రాత నిజమా? అబద్దమా? బ్రహ్మకు అంత శక్తి ఉందా?

Just In

01

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మార్కెట్‌లోకి వచ్చేశారు..

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు